తెలంగాణలో ఎండల తీవ్రత ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 42 మంది వడదెబ్బతో మరణించగా, గత మూడు రోజుల్లో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 43-46°C ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోహిణి కార్తెతో వేడి మరింత పెరిగే అవకాశం ఉంది.