AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drishyam 3: దృశ్యం3ను వెంకీ ఎందుకు వదిలేశాడు..? గురూజీ కథే అసలు కారణమా!

Drishyam 3: దృశ్యం3ను వెంకీ ఎందుకు వదిలేశాడు..? గురూజీ కథే అసలు కారణమా!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 25, 2026 | 7:38 PM

Share

మోహన్ లాల్ నటించిన దృశ్యం 3కు మిక్స్డ్ టాక్ రావడంతో వెంకటేష్ ఈ రీమేక్ చేయకపోవడం సరైన నిర్ణయమనే చర్చ మొదలైంది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం కథలో ఉన్న ట్విస్టులు వెంకీని బాగా ఆకట్టుకున్నాయని సమాచారం. అదే కారణంగా దృశ్యం 3 రీమేక్‌ను పక్కన పెట్టారనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.

దృశ్యం 3 సినిమాని వెంకటేష్ కావాలనే వదిలేశారా..? తాజాగా మూడో భాగానికి వస్తున్న మిక్డ్స్ రెస్పాన్స్ చూసాక వెంకీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారా..? దృశ్యం 3 సినిమాను రీమేక్ చేయకపోవడానికి కారణం త్రివిక్రమేనా..? గురూజీ కారణంగానే దృశ్యం ఫ్రాంచైజీ నుంచి వెంకీ తప్పుకున్నారా..? అసలు దృశ్యం 3 రీమేక్‌కు, ఆదర్శ కుటుంబానికి ఉన్న లింక్ ఏంటి..? దృశ్యం 3 విడుదలైంది.. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్‌కు ఊహించిన టాక్ అయితే రాలేదు. తొలి 2 పార్ట్స్‌తో పోలిస్తే.. ఈసారి జీతూ మ్యాజిక్ మిస్ అయిందనే నిరాశే ఫ్యాన్స్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. చివరి 20 నిమిషాలు మినహా.. సినిమా అంతా స్లోగా నడిచిందనే టాక్ ఎక్కువగా వస్తుంది. మరోవైపు ఈ రీమేక్ మిస్ చేసి వెంకటేష్ మంచి పనే చేసాడంటున్నారు అభిమానులు. దృశ్యం, దృశ్యం 2ల్లో రాంబాబు పాత్రలో అదరగొట్టారు వెంకీ. దాంతో పార్ట్ 3 కూడా చేస్తారనుకున్నారంతా. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం కేవలం కుటుంబ కథ మాత్రమే కాదు.. ఊహించని మలుపులు కూడా ఉండబోతున్నాయి. ఈసారి రొటీన్ నెరేషన్‌కి భిన్నంగా గురూజీ సరికొత్త స్క్రీన్‌ప్లేతో ప్రయోగాలు చేస్తున్నారని తెలుస్తుంది. ట్విస్టులు, టర్నులతో కూడిన సాలిడ్ స్టోరీని వెంకీ కోసం త్రివిక్రమ్ సిద్ధం చేశారని.. ఈ కథ విన్నాకే దృశ్యం 3 రీమేక్‌ ఆలోచన వెంకటేష్ పక్కన పెట్టారనే చర్చ నడిచింది. కారణమేదైనా దృశ్యం 3ని రీమేక్ చేయకుండా వెంకీ సరైన నిర్ణయమే తీసుకున్నారనే చర్చ మొదలైందిప్పుడు. మరి చూడాలిక.. దృశ్యంను మరిపించేలా వెంకీ, త్రివిక్రమ్‌ల ఆదర్శ కుటుంబం ఉంటుందో లేదో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌.. మూడేళ్లలో కట్టేసిన చైనా రోబోలు

కీచక భర్తకు బుద్ధి చెప్పిన భార్య..ఏం చేసిందంటే

భారతీయ నర్స్ కుటుంబాన్ని బహిష్కరించిన ఆస్ట్రేలియా

టెకీలకు గడ్డుకాలం.. కెనడా , యూరప్ వైపు చూపు

Follow Us