పెద్ద సినిమాలకు వరసగా మారుతున్న సంగీత దర్శకుల పేర్లు
టాలీవుడ్‌లో పెద్ద సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ల మార్పులు ఇప్పుడు కామన్‌గా మారుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి విశ్వంభర వరకు చాలాచోట్ల పాటలు ఒకరు.. బ్యాగ్రౌండ్ స్కోర్ మరొకరు చేస్తున్నారు. బిజీ షెడ్యూల్స్, క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రౌడీ జనార్ధన్, ఆదర్శ కుటుంబం సినిమాల్లో కూడా సంగీత దర్శకుల మార్పులు ఆసక్తిగా మారాయి.
మార్పు మంచికేనా..? ఇండస్ట్రీలో సినిమాలకు టెక్నీషియన్స్ మారడం అనేది చాలా కామన్.. మరీ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలోనే ఈ మార్పులు చేర్పులు ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఇదే జరుగుతుంది మన టాలీవుడ్‌లో..! పేరున్న పెద్ద సినిమాలకు వరసగా సంగీత దర్శకుల పేర్లు మారిపోతున్నాయి. తాజాగా మరో సినిమాకు ఇదే జరిగింది. అసలేంటి ఈ ఛేంజెస్..? ఈ మధ్య పెద్ద సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్స్ ఛేంజ్ కామన్ అయిపోయింది. సినిమా మొదలైనపుడు ఒకరితో.. తర్వాత మరొకరితో పూర్తవుతున్నాయి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు పాటల వరకు దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేస్తే.. RR వర్క్ అంతా థమన్ చూసుకున్నారు. పుష్ప 2 విషయంలోనూ ఇదే జరిగింది. చిరంజీవి విశ్వంభరకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ మార్పులు తప్పలేదు. ఈ సినిమాకు కీరవాణి పాటల వరకు పని చేస్తే.. బ్యాగ్రౌండ్ స్కోర్ వర్క్ మిరాయ్ ఫేమ్ హరి గౌర చూసుకుంటున్నారని తెలుస్తుంది. వారణాసితో కీరవాణి బిజీగా ఉండటంతో.. విశ్వంభర RR బాధ్యతలు గౌర హరికి ఇచ్చారు. అనిల్ రావిపూడి కూడా భీమ్స్‌ను కాదని.. వెంకీ, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు జీవీ ప్రకాశ్ వైపు వెళ్తున్నారు. విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా కాంబోలో వస్తున్న రౌడీ జనార్ధనకు ముందు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో క్సేవిర్‌ను తీసుకున్నారు.. టీజర్‌కు ఆయనే స్కోర్ చేసారు. ఇప్పుడు ఆయన స్థానంలో విశాల్ మిశ్రా వచ్చారు. అలాగే వెంకీ, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబంకు ముందు హర్షవర్ధన్ రామేశ్వర్‌ను తీసుకుని.. తమన్‌తో రీ ప్లేస్ చేసారిప్పుడు. మరి ఈ మార్పులు మంచికేనా కాదా అనేది చూడాలిక.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్.. మూడేళ్లలో కట్టేసిన చైనా రోబోలు
కీచక భర్తకు బుద్ధి చెప్పిన భార్య..ఏం చేసిందంటే
టెక్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ ఏఐ స్థానంలో మళ్లీ ఉద్యోగులు
భారత్‌లో కొత్త ట్రెండ్..పెళ్లికి "నో" చెబుతున్న యంగ్ ఇండియా.!
జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ.. పోలీసుల సంచలన ప్రకటన!
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..

