AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీటెక్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫీజులు ఫిక్స్ చేసిన సర్కార్.. ఏ కాలేజీలో ఎంతంటే..?

తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. రాబోయే మూడేళ్ల కాలానికి సంబంధించి ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Telangana: బీటెక్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫీజులు ఫిక్స్ చేసిన సర్కార్.. ఏ కాలేజీలో ఎంతంటే..?
Telangana Engineering Fee Structure 2025 2028
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Mar 06, 2026 | 1:12 PM

Share

తెలంగాణలోని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీఈ, బీటెక్ కోర్సులకు సంబంధించిన ట్యూషన్ ఫీజులను తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ నిర్ణయించింది. 2025-26 విద్యా సంవత్సరం నుండి 2027-28 వరకు వర్తించేలా ఈ కొత్త ఫీజుల నిర్మాణాన్ని ఖరారు చేస్తూ మార్చి 4న ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం.. వివిధ కళాశాలలకు వేర్వేరు ఫీజులు నిర్ణయించారు.

  • ACE ఇంజనీరింగ్ కాలేజీ: రూ.1,10,000
  • అను బోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: రూ.1,08,100
  • అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీ: రూ.90,000
  • భారత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ): రూ.89,000
  • అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్: రూ.75,000
  • అరోరా గ్రూప్ కళాశాలలు: వీటిలో రూ.45,000 నుండి గరిష్టంగా రూ.67,800 వరకు ఫీజులు ఉన్నాయి.
  • అనేక కళాశాలలకు కనీస ట్యూషన్ ఫీజుగా రూ.45,000 నిర్ణయించారు

కమిటీ కీలక ఆదేశాలు

ఈ ఫీజుల వసూలు విషయంలో TAFRC స్పష్టమైన నిబంధనలను విధించింది. సంస్థలు వార్షిక ట్యూషన్ ఫీజును ఒకేసారి లేదా వాయిదాల పద్ధతిలో ముందుగానే వసూలు చేయవచ్చు. నిర్ణయించిన రుసుములో ప్రత్యేక రుసుము, ప్రవేశ రుసుము ఉండవు. క్యాపిటేషన్ ఫీజు లేదా విరాళాల పేరుతో ఎటువంటి అనధికారిక వసూళ్లకు పాల్పడవద్దని హెచ్చరించింది. ఫీజుల ద్వారా వచ్చే మిగులు ఆదాయాన్ని సంస్థ ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించాలి. వ్యక్తిగత లాభాల కోసం మళ్లించకూడదు.

గుర్తింపు ఉంటేనే అడ్మిషన్లు

రాష్ట్ర ప్రభుత్వం, AICTE లేదా సంబంధిత విశ్వవిద్యాలయాల నుండి సరైన గుర్తింపు, అనుమతులు పొందని సంస్థలకు కోర్సులను నిర్వహించేందుకు అనుమతి ఉండదు. ఒకవేళ కళాశాలలు సమర్పించిన డేటా తప్పు అని తేలితే, ఫీజులను సవరించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిటీ స్పష్టం చేసింది. అడ్మిషన్లు పొందే సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే చెల్లించాలని, అదనపు వసూళ్లపై ఫిర్యాదు చేసే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా MS అడ్మిషన్లు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర