AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని ఆసక్తికర నిజం..

సాయంత్రం టీ తో పాటు వేడివేడి సమోసా తింటే వచ్చే ఆ కిక్కే వేరు.. దేశంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతీ ఒక్కరినీ అలరించే స్నాక్ సమోసా. అయితే ప్రతీరోజూ ఎంతో ఇష్టంగా తినే ఈ సమోసాను ఇంగ్లీషులో ఏమని పిలుస్తారో మీకు తెలుసా? Samosa అనే ఇంగ్లీషు పదం అని అందరూ అనుకుంటారు కానీ దీనికి ఒక ప్రత్యేకమైన పేరు ఉందనే విషయం చాలామందికి తెలియదు.

సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని ఆసక్తికర నిజం..
What Is Samosa Called In English
Krishna S
|

Updated on: Jul 28, 2026 | 4:10 PM

Share

వర్షం పడినా, సాయంత్రం టీ సమయమైనా మన మనసు వెంటనే కోరుకునే స్నాక్ సమోసా. కరకరలాడే పైపొర, లోపల ఆలుగడ్డ మసాలా నింపి నూనెలో వేయించిన వేడివేడి సమోసాను ఇష్టపడని వారు దాదాపు ఉండరు. ఉత్తర భారతం నుండి దక్షిణ భారతం వరకు ప్రతి గల్లీలోనూ సమోసా అత్యంత ప్రజాదరణ పొందిన ఆహార పదార్థం. అయితే రోజూ మనం ఎంతో ఇష్టంగా తినే ఈ సమోసాను ఇంగ్లీషులో ఏమని పిలుస్తారో మీకు తెలుసా? చాలామంది సమోసాను ఇంగ్లీషులో కూడా Samosa అనే పిలుస్తారని అనుకుంటారు. కానీ ఆంగ్ల డిక్షనరీ ప్రకారం సమోసాకు ఒక ప్రత్యేకమైన పేరు ఉందనే విషయం 99శాతం మందికి తెలియదు.

సమోసాకు ఇంగ్లీష్ పేరు ఏంటీ?

ఇంగ్లీష్ డిక్షనరీ, వ్యాకరణ నిపుణుల ప్రకారం సమోసాను సావరీ ఫ్రైడ్ పేస్ట్రీ అని పిలుస్తారు.

  • Savory: కారం, ఉప్పు లేదా మసాలా రుచి కలిగిన పదార్థం.
  • Fried : నూనెలో వేయించినది.
  • Pastry : మైదా లేదా పిండితో తయారు చేసిన పైపొర.

అయితే దీనిని కొన్ని ప్రాంతాల్లో రూపం ఆధారంగా ట్రయాంగిల్ పై లేదా రిసోల్ అని కూడా వ్యవహరిస్తుంటారు.

అసలు సమోసా మన దేశానికి ఎలా వచ్చింది?

సమోసా అనగానే మన భారతీయ సాంప్రదాయ వంటకమే అని అందరూ భావిస్తారు. కానీ సమోసా పుట్టింది మన దేశంలో కాదు. దీని మూలాలు పద పదవ శతాబ్దానికి చెందిన మధ్యప్రాచ్యంలో ఉన్నాయి. అక్కడ దీనిని సంబోసా లేదా సంబుసక్ అని పిలిచేవారు. దమూడో శతాబ్దంలో మధ్యప్రాచ్యం నుంచి వచ్చిన పర్షియన్ వ్యాపారులు, వంటగాళ్ల ద్వారా ఈ రుచికరమైన స్నాక్ భారత ఉపఖండానికి చేరుకుంది. కాలక్రమేణా భారతీయ శైలికి తగ్గట్టుగా ఇందులో ఆలుగడ్డ, బటానీలు, మసాలాలు చేర్చడంతో ఇది సమోసాగా మారి దేశవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొందింది.

గ్లోబల్ నేమ్‌గా సమోసా

ఇంగ్లీషులో సావరీ ఫ్రైడ్ పేస్ట్రీ అనే అధికారిక వివరణ ఉన్నప్పటికీ.. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ కూడా Samosa అనే పదాన్ని నేరుగా ఇంగ్లీష్ భాషలోకి స్వీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఫుడ్ ప్రాచుర్యం పొందడంతో ఇప్పుడు విదేశీయులు కూడా దీనిని సమోసా అని పిలవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏది ఏమైనా, పేరు ఏదైనా సరే.. టీ టైమ్‌లో వేడివేడి సమోసా ఇచ్చే ఆ కిక్కే వేరు.

Follow Us
సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని..
సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని..
స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..
స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..
శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు..
శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు..
Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లు.. కట్‌చేస్తే..
Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లు.. కట్‌చేస్తే..
వావ్.. కొత్త వందే భారత్ స్లీపర్ లోపలి లుక్ చూశారా..?
వావ్.. కొత్త వందే భారత్ స్లీపర్ లోపలి లుక్ చూశారా..?
బాల్యానికి పుస్తెల బంధం.. పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్!
బాల్యానికి పుస్తెల బంధం.. పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్!
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్.. ఇకపై తత్కాల్ టికెట్ల గురించి..
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్.. ఇకపై తత్కాల్ టికెట్ల గురించి..
NEET రీ-టెస్ట్‌లో ఆశించిన మార్కులు రాలేదనీ విద్యార్ధిని సూసైడ్
NEET రీ-టెస్ట్‌లో ఆశించిన మార్కులు రాలేదనీ విద్యార్ధిని సూసైడ్
రోహిత్, కోహ్లీ కాదు.. వన్డే వరల్డ్ కప్‌లో ఆ ఇద్దరు లేకుంటే బూడిదే
రోహిత్, కోహ్లీ కాదు.. వన్డే వరల్డ్ కప్‌లో ఆ ఇద్దరు లేకుంటే బూడిదే
గురు పౌర్ణమి నాడు అరుదైన 3 మహా యోగాలు.. ఈ శుభ సమయాన్ని అస్సలు..
గురు పౌర్ణమి నాడు అరుదైన 3 మహా యోగాలు.. ఈ శుభ సమయాన్ని అస్సలు..