కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయి..? అసలు మిస్టరీ తెలిస్తే అవాక్కే..
Krishna
08 may 2026
ఎలాంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన, సహజమైన పానీయం కాబట్టి కొబ్బరి నీళ్లను సమ్మర్ సంజీవిని లేదా వేసవి చల్లని రాజు అని పిలుస్తారు. ఎండాకాలంలో దీనికి తిరుగులేదు.
సమ్మర్ సంజీవిని
కొబ్బరి చెట్టు వేర్ల ద్వారా భూమి నుండి గ్రహించిన నీరు, చెట్టులోని జైలం అనే ప్రత్యేక వ్యవస్థ ద్వారా ప్రయాణించి కాయ లోపల నిల్వ చేయబడుతుంది.
నీరు ఎలా వస్తుంది
భూమి నుండి నీరు కాయలోకి వెళ్లే ప్రయాణంలో వేర్లు గ్రహించిన ఖనిజాలు, పోషకాలు ఇందులో కలుస్తాయి. అందుకే ఇది సహజంగా తీపిగా, శక్తివంతంగా ఉంటుంది.
పోషకాల గని
ఇందులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి వేసవిలో చెమట ద్వారా కోల్పోయిన లవణాలను తిరిగి అందించి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.
తక్షణ హైడ్రేషన్
బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది తాగినప్పుడు ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.
బరువు తగ్గడానికి
మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించడానికి, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి కొబ్బరి నీరు ఎంతో సహాయపడుతుంది. కిడ్నీ పేషెంట్లు రెగ్యులర్‌గా తీసుకోవడం చాలా మంచిది.
కిడ్నీ ఆరోగ్యం
కొబ్బరికాయను ఊపినప్పుడు శబ్దం రాకూడదు. శబ్దం రాకపోతే నీరు నిండుగా ఉందని అర్థం. కాయ ఆకుపచ్చ రంగులో ఉండి, పరిమాణం చిన్నగా ఉన్నా ఎత్తినప్పుడు బరువుగా అనిపిస్తే అందులో నీరు ఎక్కువగా ఉంటుంది.
ఎలా ఎంచుకోవాలి
మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన కృత్రిమ పానీయాల కంటే సహజ సిద్ధమైన కొబ్బరి నీరు వెయ్యి రెట్లు ఆరోగ్యకరమైనది.