తవాంగ్ నుంచి మున్నార్ వరకు.. వేసవిలో తప్పక చూడాల్సిన  ప్రదేశాలు ఇవే!

samatha

06 may 2026

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది వేడిమి, ఉక్కపోత నుంచి బయటపడటానికి చల్లని ప్రదేశాలకు టూర్ వెళ్తుంటారు. కూల్ కూల్‌గా ఎంజాయ్ చేస్తుంటారు.

సమ్మర్

అయితే తవాంగ్ నుంచి మున్నార్ వరకు వేసవిలో తప్పక చూడాల్సిన కొన్ని  అందమైన చల్లటి ప్రదేశాలు ఉన్నాయంట. అవి ఏవో చూసేద్దాం.

టూరిస్ట్ ప్లేసెస్

మండే వేసవిలో కూడా చాలా చల్లగా ఉండే అందమైన,అద్భుతమైన ప్రదేశంలో తవాంగ్ ఒకటి, ఇక్కడ 15 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రతలతో చల్లగా ఉంటుంది.

తవాంగ్

వేసవిలో లడఖ్ చాలా చల్లగా ఉంటుంది. సమ్మర్‌లో వేడి ప్రదేశం నుంచి బయటపడాలి అనుకునే వారికి ఇది చాలా బెస్ట్ అని చెప్పాలి.

లడఖ్

మనాలి. పచ్చని చెట్లు , అందమైన ప్రకృతి, జలపాతల మధ్య ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉన్నది అంటే మనాలి బెస్ట్. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది.

మనాలి

అదే విధంగా కెంఫ్టీ  ఫాల్స్, గన్ హిల్ , మాల్ రోడ్‌లను సందర్శించాలి అనుకునేవారికి, అలాగే చల్లటి ప్రదేశాల్లో ఎంజాయ్ చేయాలి అనుకునేవారికి, ముస్సోరి బెస్ట్ ప్లేస్.

ముస్సోరి

కాఫీ తోటలు, అందమైన జలపాతాలు, కొండలు, పచ్చటి ప్రదేశాలు, అసలు వేడి అంటే కూడా తెలియకుండా ఎంజాయ్ చేయాలి అనుకునేవారికి కూర్గ్  బెస్ట్.

కూర్గ్

చాలా చల్లటి ప్రదేశాల్లో డార్జిలింగ్ ఒకటి.  ఇక్కడ 17 నుంచి  22 డ్రిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. టాయ్ ట్రైన్ రైడ్‌, గార్డెన్‌ల మధ్య ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చును.

డార్జిలింగ్