బంగారం కొనడం కష్టమే.. మరో ఆరు నెలల్లో గోల్డ్ రేట్ ఎంత ఉండనుందో తెలుసా?

samatha

06 may 2026

బంగారం అంటే ఇష్టం లేని మగువలే ఉండరు. మహిళలకు అత్యంత ప్రియమైనదానిలో బంగారమే ముందుంటుంది. అందుకే చాలా మంది ఎక్కువగా బంగారం కొనడానికి ఇష్టపడతారు.

బంగారం

అయితే గతంలో ఏ చిన్న ఫంక్షన్, పార్టీ జరిగినా సరే ఎక్కువగా బంగారమే కొనుగోలు చేసే వారు. కానీ ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయాలి అంటే భయపడాల్సిన రోజులు వచ్చాయి.

శుభకార్యాలు

రోజు రోజు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. తగ్గుతాయేమో అని ఆశపడుతున్న వారి ఆశలు నిరాశలు చేస్తూ గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి.

బంగారం ధరలు

త్వరలో అంటే వచ్చే ఆరు నెలల్లో బంగారం ధర విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు నిపుణులు.  భారతీయ మార్కెట్‌లలో 10 గ్రాముల బంగారం 1,90,000ల నుంచి 200000 వరకు చేరుకునే ఛాన్స్ఉన్నదంట.

బంగారం పెరుగుదల

2026లో వివిధ దేశల రిజర్వ్ బ్యాంకులు దాదాపు 800 టన్నుల  బంగారాన్ని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. యుద్ధ ప్రభావం వలన బంగారం ధర పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

రిజర్వ్ బ్యాంకులు

వడ్డి రేట్లు తగ్గితే డాలర్ విలువ పడిపోయి, బంగారం ధరలు పెరుగుతాయి, అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ పై ఆధారపడటం తగ్గించడానికి చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయంట.

డాలర్ విలువ పడిపోవడం

దీంతో డాలర్ విలువ చాలా  వరకు క్షీణించి, బంగారం ధర విపరీతంగా పెరుగుతుందంట. అందుకే వచ్చే ఆరు నెలల్లో బంగారం ధర విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.

బంగారం పెరుగుతుంది

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

గమనిక