ప్రపంచంలోనే అత్యంత వింతైన గుడ్లు.. ఇలాంటి వాటిని మీరెప్పుడూ చూసుండరు!
Anand T
08 may 2026
ఇది సముద్రపు అడుగున ఉండే ఈ షార్క్ గుడ్లు ఇవి చూడ్డానికి స్క్రూ ఆకారంలో ఉంటాయి. నీటి ప్రవాహానికి కొట్టుకుపోకుండా ఇవి రాళ్ళ సందుల్లో గట్టిగా ఇరుక్కుపోతాయి. తల్లి షార్క్ వీటిని నోటితో పట్టుకుని రాళ్ళ మధ్యలోకి స్క్రూ చేసినట్లు తోస్తుంది.
హార్న్ షార్క్ గుడ్లు
ఆస్ట్రేలియాకు చెందిన ఈమూ గుడ్లు ముదురు ఆకుపచ్చ నుండి నలుపు రంగులో మెరుస్తూ ఉంటాయి. దాదాపు 700-900 గ్రాముల బరువుండే ఈ గుడ్లను మగ ఈమూ పక్షి మాత్రమే ఎనిమిది వారాల పాటు పొదుగుతుంది.
ఈమూ గుడ్లు
దక్షిణ అమెరికాలో ఉండే ఈ పక్షుల గుడ్లు నీలం, ఆకుపచ్చ, ఊదా రంగుల్లో పింగాణీ పాత్రల్లా మెరుస్తుంటాయి. ఈ మెరుపు వల్ల వర్షం నీరు గుడ్డుపై నిలవకుండా జారిపోయి లోపల ఉన్న పిల్ల సురక్షితంగా ఉంటుంది.
టినాము గుడ్లు
ఇవి సముద్రం అడుగున ద్రాక్ష గుత్తుల వలె కనిపిస్తాయి. తల్లి ఆక్టోపస్ వేల సంఖ్యలో బియ్యం గింజ పరిమాణంలో ఉండే పారదర్శక గుడ్లను పెడుతుంది. పిల్లలు పుట్టే వరకు ఏమీ తినకుండా వాటిని కాపాడి, చివరకు ప్రాణాలు విడుస్తుంది.
ఆక్టోపస్ గుడ్లు
ఈ కీటకం తన గుడ్లను గాలిలో వేలాడేలా పెడుతుంది! ఆకు ఉపరితలం నుండి సన్నని సిల్క్ దారాలను సృష్టించి వాటి చివర గుడ్లను ఉంచుతుంది. చీమలు, ఇతర కీటకాల నుండి కాపాడుకోవడానికి ఈ ఏర్పాటు.
లేస్ వింగ్ గుడ్లు
ప్లాటిపస్ ఒక క్షీరదం అయినప్పటికీ గుడ్లు పెడుతుంది. వీటి గుడ్లు చర్మం లాగా మెత్తగా, సాగే గుణం కలిగి ఉంటాయి. తల్లి ప్లాటిపస్ తన వేడి తోకతో చుట్టి ఈ గుడ్లను పది రోజుల పాటు పొదుగుతుంది.
ప్లాటిపస్ గుడ్లు
ప్రపంచంలోనే అతి చిన్న పక్షి గుడ్లు ఇవి. కేవలం ఒక కాఫీ గింజ పరిమాణంలో, అర గ్రాము కంటే తక్కువ బరువు ఉంటాయి. తల్లి పక్షి సాలెపురుగు దారాలు, నాచుతో సున్నితమైన గూడును నిర్మిస్తుంది.
హమ్మింగ్ బర్డ్ గుడ్లు
అంతరించిపోయిన ఈ రాక్షస పక్షి గుడ్డు అత్యంత భారీది. ఒక్క ఎలిఫెంట్ బర్డ్ గుడ్డు 100 కోడిగుడ్లతో సమానం! సుమారు అడుగు పొడవుండే ఈ శిలాజ గుడ్లు నేడు మ్యూజియాల్లో కోట్లాది రూపాయల ధరకు అమ్ముడవుతున్నాయి.