AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న గంగానది పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై కేంద్రీకృతమై పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్
Weather Update
Shaik Madar Saheb
|

Updated on: Jul 28, 2026 | 4:48 PM

Share

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి ,ఉత్తర తీర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న గంగానది పశ్చిమ బెంగాల్‌పై ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, ఇది ఈ రోజు, జూలై 28, 2026, ఉదయం 0830 గంటలకు, ఉత్తర అంతర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న గంగానది పశ్చిమ బెంగాల్‌పై, 21.9° ఉత్తర అక్షాంశం, 86.8° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది బారిపడ (ఒడిశా)కు ఆగ్నేయంగా 10 కిలోమీటర్లు, బాలాసోర్ (ఒడిశా)కు ఉత్తర-వాయువ్యంగా 40 కిలోమీటర్లు, మిడ్నాపూర్ (పశ్చిమ బెంగాల్)కు నైరుతిగా 80 కిలోమీటర్లు, జంషెడ్‌పూర్ (జార్ఖండ్)కు దక్షిణ-ఆగ్నేయంగా 120 కిలోమీటర్లు, కియోంఝర్‌గఢ్ (ఒడిశా)కు తూర్పు-ఈశాన్యంగా 140 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.

సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు అనూప్‌గఢ్, పిలానీ, హమీర్‌పూర్, డాల్టన్‌గంజ్, ఉత్తర అంతర్గత ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న గంగానది పశ్చిమ బెంగాల్‌పై ఏర్పడిన తీవ్ర వాయుగుండం కేంద్రం గుండా ప్రయాణిస్తూ, అక్కడి నుండి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతుంది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం;-

మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముంది.

బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణకోస్తా ఆంధ్రప్రదేశ్: –

మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముంది.

బుధవారం, గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ:-

మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

బుధవారం, గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

Follow Us