AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టాక్ మార్కెట్లలో జియో సునామీ.. ఐపీఓకు డేట్ ఖరారు..! ఎప్పుడంటే..?

జియో ప్లాట్‌ఫామ్స్ రూ. 37,700 కోట్ల భారీ IPOతో మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇది దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్‌గా నిలవనుంది. ఈ నిధులతో 5G, AI సేవలను విస్తరించనుంది. అయితే ఐపీఓ ఎప్పుడు వస్తుందనే దానికి ముహూర్తం ఖరారు అయింది.

స్టాక్ మార్కెట్లలో జియో సునామీ.. ఐపీఓకు డేట్ ఖరారు..! ఎప్పుడంటే..?
Jio Ipo
Venkatrao Lella
|

Updated on: Oct 03, 2026 | 10:39 PM

Share

భారత టెలికాం రంగంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిన జియో ప్లాట్‌ఫామ్స్.. ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఒక మైలురాయిని సృష్టించడానికి సన్నద్ధమవుతోంది. దేశంలోనే అతిపెద్ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)తో మార్కెట్లోకి ప్రవేశించడానికి రంగం సిద్ధమైంది. ఈ మెగా ఆఫరింగ్ ద్వారా జియో సుమారు రూ. 37,700 కోట్ల (3.8 బిలియన్ డాలర్లు) భారీ నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గతంలో 2024లో హ్యుందాయ్ మోటార్ ఇండియా జారీ చేసిన రూ. 27,870 కోట్ల IPO రికార్డును అధిగమించనుంది. జియో ప్లాట్‌ఫామ్స్ తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను 2026 జూన్ 19న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కి దాఖలు చేసింది. దీనికి సంబంధించి 2026 ఆగస్టు 28న సెబీ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత IPO పూర్తిగా 100 శాతం బుక్-బిల్ట్ ఫ్రెష్ ఇష్యూ రూపంలో రానుంది.

ఒక్కో ఈక్విటీ షేర్ ఫేస్ వాల్యూ రూ. 10గా నిర్ణయించారు. అక్టోబర్ 21న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకునే అవకాశం ఉండగా.. ఇష్యూ అక్టోబర్ 23 వరకు కొనసాగనుంది. అక్టోబర్ 28న ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది.  కంపెనీ గరిష్టంగా 27 కోట్ల షేర్లను మార్కెట్‌లోకి జారీ చేయనుంది. ప్రస్తుతం ఈ ఇష్యూలో ఎలాంటి ఆఫర్ ఫర్ సేల్ (OFS) అంశం లేదు. ఇష్యూ తర్వాత కంపెనీ చెల్లించే ఈక్విటీ మూలధనంలో ఈ 27 కోట్ల షేర్లు 2.9% వాటాను సూచిస్తాయి. జియో ప్లాట్‌ఫామ్స్ వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రమోట్ చేస్తోంది. 2026 మార్చి 30 నాటికి జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఆ సంస్థకు 66.43 శాతం వాటా ఉంది. మిగిలిన యాజమాన్యాన్ని వివిధ ఆర్థిక, వ్యూహాత్మక ఇన్వెస్టర్లు, ఇతర వాటాదారులు కలిగి ఉన్నారు.

ఈ కొత్త షేర్లను బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)తో పాటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) రెండింటిలోనూ అధికారికంగా లిస్ట్ చేయనున్నారు. ఈ భారీ ఇష్యూ నిర్వహణ కోసం KFin టెక్నాలజీస్ లిమిటెడ్‌ను అధికారిక రిజిస్ట్రార్‌గా నియమించారు. ఈ ఆఫరింగ్‌ను విజయవంతం చేయడానికి 19 మంది సభ్యులతో కూడిన పెద్ద బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు.  టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఈ కంపెనీ రాబోయే రోజుల్లో కొత్త టెక్నాలజీలను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. 5G సేవలను మరింత విస్తృతం చేయడానికి, అలాగే AI ఆధారిత సేవలను అందించడానికి ఈ నిధులు గణనీయంగా సహాయపడతాయి.

Follow Us
పెరిగిన రకూన్‌ల సంఖ్య.. పంట నష్టంతో రైతులు విలవిల !
పెరిగిన రకూన్‌ల సంఖ్య.. పంట నష్టంతో రైతులు విలవిల !
కేవలం రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్
కేవలం రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్
ఏపీకి తుఫాన్ ముప్పు.. రాబోయే 5 రోజులు భారీ వర్షాలు..
ఏపీకి తుఫాన్ ముప్పు.. రాబోయే 5 రోజులు భారీ వర్షాలు..
'జైలర్ 2' రికార్డు కలెక్షన్లు.. ఎట్టకేలకు నెరవేరనున్న కోలీవుడ్ కల
'జైలర్ 2' రికార్డు కలెక్షన్లు.. ఎట్టకేలకు నెరవేరనున్న కోలీవుడ్ కల
క్రెడిట్ కార్డు ఉపయోగించడం లేదా..? మీకే నష్టం.. ఎలా అంటే..?
క్రెడిట్ కార్డు ఉపయోగించడం లేదా..? మీకే నష్టం.. ఎలా అంటే..?
కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
వెంకీ, త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం 'ట్రైలర్ వచ్చేసింది
వెంకీ, త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం 'ట్రైలర్ వచ్చేసింది
రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే
రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే
ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతున్నాయా? ఈ మసాలా స్నాక్ చేస్తే అదుర్స్
ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతున్నాయా? ఈ మసాలా స్నాక్ చేస్తే అదుర్స్
ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్.. ఎవరంటే?
ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్.. ఎవరంటే?