ఆ హీరో నా సీక్రెట్ క్రష్.. ఆయన వైపు చూస్తూ ఉండిపోయేదాన్ని.. సిమ్రాన్
Rajitha Chanti
Pic credit - Instagram
03 October 2026
దక్షిణాదిలో ఒకప్పుడు తన డ్యాన్స్, నటన, గ్లామర్‌తో కుర్రకారును ఊపేసిన నటి సిమ్రాన్. తొంభైల కాలంలో ఆమె కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.
ఎంతోమంది స్టార్ హీరోల సరసన బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్న ఈ భామ, తాజాగా తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ అంటే క్రష్ అంట.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సిమ్రాన్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే కాకుండా సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత కూడా ఇష్టమని తెలిపింది
చాలా ఏళ్లుగా రజినీకాంత్ సర్ అంటే నాకు విపరీతమైన క్రష్ ఉండేది. ఆయన స్క్రీన్‌పై కనిపిస్తే ఇచ్చే ఎనర్జీ, స్టైల్ వేరే ఏ నటుడిలోనూ కనిపించవు.
ఆయనను చూస్తూ అలా ఉండిపోయేదాన్ని అని సిమ్రాన్ చెప్పారు. ప్రపంచమంతా ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అంటూ మెచ్చుకుంటారు.
కానీ నాకు మాత్రం రజినీకాంత్ గారే నిజమైన సూపర్‌హీరో. ఆయన విలక్షణమైన నటన, మ్యానరిజమ్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి అని అన్నారు.
తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో రజినీకాంత్ సరసన నటించే అవకాశం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశానని సిమ్రాన్ తెలిపారు.
ఎట్టకేలకు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన 'పేట్టా' చిత్రంలో రజినీకాంత్‌తో కలిసి నటించే అవకాశం రావడం తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన క్షణమని అన్నారు.