డేరింగ్ అండ్ డాషింగ్ లుక్స్‏తో నెట్టింటిని షేక్ చేస్తున్న హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

03 October 2026

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ గుర్తింపును తెచ్చుకుంది ఐశ్వర్యా రాజేష్

హోమ్లీ లుక్స్‌తోనే కాకుండా, ప్రయోగత్మక పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ భామ, తాజాగా నెట్టింట పోస్ట్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

'డేరింగ్ అండ్ డాషింగ్' గ్లామరస్ ఫోటోలు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఐశ్వర్య లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. 

సాధారణంగా చీరకట్టు లేదా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించే ఐశ్వర్యా, ఈసారి దానికి పూర్తి భిన్నంగా మోడ్రన్ అండ్ బోల్డ్ అవతార్‌లో దర్శనమిచ్చారు.

పవర్‌ఫుల్ అటిట్యూడ్, ట్రెండీ అవుట్‌ఫిట్స్ , బోల్డ్ పోజులతో తీయించుకున్న ఫోటోలు ఆమెలోని మరో గ్లామరస్ కోణాన్ని ఆవిష్కరించాయి.

ఐశ్వర్యా రాజేష్ పోస్ట్ చేసిన ఈ సరికొత్త ఫోటోలు క్షణాల్లోనే వైరల్ కాగా, ఆమె అభిమానులు, నెటిజన్స్ భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. 

"డేరింగ్ అండ్ డాషింగ్", "బ్యూటీ విత్ ఆటిట్యూడ్" అంటూ కామెంట్లతో ఐశ్వర్య ఫోటోస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. 

ఒకవైపు నటనకు ఆస్కారమున్న లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూనే, మరోవైపు ఇలాంటి స్టైలిష్ ఫోటోషూట్‌లతో డిజిటల్ స్పేస్‌లో ట్రెండ్ సెట్ చేస్తున్నారు.