AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అమెరికా వెళ్లిన కల.. క్యాన్సర్‌తో ముగిసిన జీవితం..

ఉన్నత చదువులు చదివి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలన్న కోటి ఆశలతో అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువతిని క్యాన్సర్ మహమ్మారి బలితీసుకుంది. చదువు పూర్తి చేసుకుని ప్రయోజకురాలై తిరిగి వస్తుందనుకున్న కన్నవారికి తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. రెండు నెలల పాటు మృత్యువుతో పోరాడి 27 ఏళ్ల పిన్న వయసులోనే ఆమె కన్నుమూయడంతో స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Telangana: అమెరికా వెళ్లిన కల.. క్యాన్సర్‌తో ముగిసిన జీవితం..
Indian Student Dies In Us
M Revan Reddy
| Edited By: |

Updated on: Oct 03, 2026 | 10:54 PM

Share

పై చదువుల కోసమని విదేశాలకు వెళ్లిన.. యువతి క్యాన్సర్ కారణంగా.. అక్కడే ప్రాణాలు కోల్పోయింది నల్గొండ జిల్లాకు చెందిన మాన్వితా రెడ్డి అనే యువతి. వివరాల్లోకి వెళ్తే.. వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన కందిమల్ల లక్ష్మారెడ్డి, పద్మ దంపతుల చిన్న కుమార్తె మాన్వితా రెడ్డి (27). హైదరాబాద్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె, ఉన్నత విద్యను అభ్యసించేందుకు మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆమె మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ సమీపంలో తన స్నేహితులతో కలిసి నివసిస్తూ చదువుకుంటున్నారు.

అయితే గత నెల 4వ తేదీన మాన్వితా రెడ్డి తీవ్రమైన గొంతు నొప్పితో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటనే ఆమె స్నేహితులు బాల్టిమోర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా, ఆమె నాలుగో దశ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. అనంతరం సెప్టెంబర్ 13న ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేర్పించారు. ఈ విషయాన్ని స్నేహితులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

అయితే ఆస్పత్రిలోనే ఉంటూ దాదాపు రెండు నెలల పాటు క్యాన్సర్‌తో పోరాడిన మాన్వితా రెడ్డి ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ విషమించింది. ఆమెను కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో అక్టోబర్ 1న ఆమె ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు.

స్వగ్రామంలో తీవ్ర విషాదం

అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇక లేదన్న వార్త తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చేతికి అందివచ్చిన కుమార్తె విగతజీవిగా మారడంతో స్వగ్రామమైన మొల్కపట్నంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. కాగా, మాన్వితా రెడ్డి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us