Jailer 2: జైలర్ 2 కు కలెక్షన్స్ సునామీ..
రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ తొలి రోజు వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద చర్చనీయాంశంగా మారింది. ట్రేడ్ నివేదికల ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.125.25 కోట్ల గ్రాస్ సాధించింది. అయితే రజనీ గత చిత్రం ‘కూలీ’ తొలి రోజు వసూళ్లైన రూ.151.75 కోట్లను మాత్రం దాటలేకపోయింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు తమిళ వెర్షన్ నుంచి అత్యధిక వసూళ్లు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.
సూపర్‌స్టార్ రజనీకాంత్ స్టామినా మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.125.25 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, ఫస్ట్ పార్ట్ మించిన ఓపెనింగ్‌తో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ మాస్ ఇమేజ్, భారీ అంచనాలు, అభిమానుల హంగామా కలిసి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేటను ప్రారంభించాయి. ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా రూ.125.25 కోట్లకు పైగా వసూళ్లు సాధించింనట్టు రిపోర్ట్. ఇండియాలో రూ.59.70 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, దేశీయ గ్రాస్ రూ.70.25 కోట్లు చేసింది. విదేశీ మార్కెట్ల నుంచి మరో రూ.55 కోట్ల గ్రాస్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా రూ.125.25 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు ప్రముఖ ట్రేడ్ ట్రాకర్ సాక్నిల్క్ వెల్లడించింది. అయితే, ‘కూలీ’ తర్వాత రజనీకాంత్ కెరీర్లో రెండో అతిపెద్ద ఓపెనింగ్ గా ‘జైలర్ 2’ నిలిచింది. జైలర్ 2 ఇండియా గ్రాస్: రూ.70.25 కోట్లు, ఇండియా నెట్: రూ.59.70 కోట్లు, విదేశీ గ్రాస్: రూ.55 కోట్లు. ప్రపంచవ్యాప్త గ్రాస్: రూ.125.25 కోట్లు. ఈ కలెక్షన్స్ చూస్తే దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్లోనూ రజనీ సినిమాకు ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. భాషల వారీగా వసూళ్లు.. తమిళంలో తిరుగులేని ఆధిపత్యంతో దూసుకుపోతోంది జైలర్2. ‘జైలర్ 2’ తొలి రోజు వసూళ్లలో తమిళ వెర్షన్ లో అత్యధిక వసూళ్లను సాధించింది. తెలుగు వెర్షన్ కూడా భారీ ఓపెనింగ్ సాధించగా, హిందీ, కన్నడ వెర్షన్లు మాత్రం తక్కువ వాటాతో సరిపెట్టుకున్నాయి. తమిళం: రూ.43.35 కోట్ల నెట్, తెలుగు: రూ.12.50 కోట్ల నెట్, హిందీ: రూ.3.50 కోట్ల నెట్, కన్నడ: రూ.0.35 కోట్ల నెట్. తమిళ వెర్షన్ 9,326 షోలతో సుమారు 70.8 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. తెలుగు వెర్షన్ 2,792 షోలతో 56.2 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. హిందీ వెర్షన్ 4,371 షోలతో 22 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేయగా, కన్నడ వెర్షన్ 110 షోలతో 54 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. రజనీకాంత్ గత చిత్రం ‘కూలీ’ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.151.75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ‘జైలర్ 2’ మాత్రం రూ.125.25 కోట్లతోనే సరిపెట్టుకుంది. ఈ క్రమంలోనే తొలి రోజు వసూళ్లలో ‘కూలీ’ని ‘జైలర్ 2’ అధిగమించలేకపోయింది. అయినప్పటికీ, ‘కూలీ’ తర్వాత రజనీకాంత్ కెరీర్లో అత్యంత భారీ ఓపెనింగ్స్‌లో ఒకటిగా ‘జైలర్ 2’ నిలిచింది. 2023లో విడుదలైన మొదటి ‘జైలర్’ చిత్రం తొలి రోజు రూ.48.35 కోట్ల వసూళ్లు సాధించింది. రజనీకాంత్ తెరపై కనిపించే తీరు, ఆయన స్టైల్, యాక్షన్ సన్నివేశాలు, మాస్ ఎలివేషన్లు అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ తనదైన శైలితో సూపర్‌స్టార్ ఇమేజ్ను మరోసారి తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నించారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి నటుల రాకతో పాటు హృతిక్ రోషన్ ప్రత్యేక పాత్రపై ఉన్న ఆసక్తి కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10 విన్నర్ ఎవరో తేల్చేసిన కౌశల్!
Weather Report: దసరా పండగ వేళ చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు
భార్యను లాడ్జ్‌కి తీసుకెళ్లాడు.. రాత్రంత్రా హ్యాపీగా ఉన్నారు.. ఉదయాన్నే బాత్రూంలో
Jabardasth Actor Babu: వా.. బాబు..! జబర్దస్త్ కమెడియన్ TO సక్సెస్ఫుల్ డైరెక్టర్!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

