Jabardasth Actor Babu: వా.. బాబు..! జబర్దస్త్ కమెడియన్ TO సక్సెస్ఫుల్ డైరెక్టర్!
జబర్దస్త్ వేదికపై కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న బాబు డేగుల ఇప్పుడు దర్శకుడిగా తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఎన్నో స్కిట్లకు రచన చేసిన ఆయన, వైవా హర్ష ప్రధాన పాత్రలో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సిరీస్ ఓటీటీలో మంచి ఆదరణ పొందుతున్నట్లు సమాచారం. జబర్దస్త్ నుంచి వచ్చిన వారు నటనతో పాటు రచన, దర్శకత్వంలోనూ రాణించగలరనే విషయానికి బాబు ప్రయాణం మరో ఉదాహరణగా నిలుస్తోంది.
జబర్దస్త్! ఒకప్పుడు ఇది నవ్వుల వేదికే కవచ్చు. కానీ ఇప్పుడిది.. అప్‌కమింగ్ డైరెక్టర్లకు, రైటర్లకు అడ్డా..! ఈ వేదిక పై రాణించిన చాలామంది.. ఇప్పుడు టాలీవుడ్లో దూసుకుపోతున్నారు. తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. లేటెస్ట్గా బాబు డేగుల కూడా జబర్దస్త్ వేదికగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి.. ఇప్పుడు డైరెక్టర్‌గా హిట్టు కొట్టాడు. తను లేటెస్ట్గా డైరెక్ట్ చేసిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సిరీస్‌తో.. అందర్నీ ఇంప్రెస్ చేసి.. డైరెక్టర్‌గా మంచి మార్కులు పడేలా చేసుకున్నాడు. జబర్దస్త్ లో ఒక సాధారణ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఈయన జబర్దస్త్‌లో టాప్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కామెడీ పంచులు, ప్రాసలు..అమాయకమైన చూపులతో.. బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించేవాడు. ఒక్క జబర్దస్త్ లోనే కాదు శ్రీదేవీ డ్రామా కంపెనీతో పాటు పలు టీవీ షోల్లోనూ తన కామెడీ ట్యాలెంట్ చూపించాడు. మనోడు నటనతోనే కాదు.. స్క్రిప్ట్ రైటింగ్లోనూ అదరగొట్టేశాడు. ఇప్పటికే జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షో కోసం వందలాది స్కిట్స్ రాశాడు. ఇలా తన మల్టీ ట్యాలెండెట్ స్కిల్స్‌తో దూసుకుపోతున్న ఈయన… రీసెంట్గా మెగా ఫోన్ పట్టాడు. వైవా హర్ష లీడ్ రోల్లో… లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. బాబు డైరెక్షన్లో వచ్చిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సిరీస్.. ఇప్పుడు ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. మంచి కామెడీ ఎంటర్టైనర్ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తోంది. మంచి వ్యూయింగ్ మినెట్స్తో.. తెలుగు టూ స్టేట్స్లో అందర్నీ ఆకట్టుకుంటోంది. హర్ష చెముడు, హైపర్ ఆది, ఐశ్వర్య , , శ్రీదేవి, జీవన్, రూప శ్రావ్య, ప్రేమ్ సాగర్ వంటి వారు.. ఈ సిరీస్ లో ప్రధాన పాత్రల్లో నటించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anupama Parameswaran: పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది! అనుపమ బోల్డ్ కామెంట్స్
Khushboo: ఐదు పదుల వయసులోనూ.. నటి ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
థెరపీ చేయించుకుంటే ఇన్సూరెన్స్ ఇస్తారా?హెల్త్ పాలసీ తీసుకోబోయేముందు ఈ నిజాలు తెలుసుకోండి!
రూ.20 వేల జీతంతోనూ పర్సనల్ లోన్.. అర్హతలు ఏమిటి? ఎంతొస్తుందో తెలుసా?
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

