Khushboo: ఐదు పదుల వయసులోనూ.. నటి ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
తమిళ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ తన అందం, చర్మ సంరక్షణ రహస్యాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నట్లు కథనాలు చెబుతున్నాయి. ఖరీదైన క్రీముల కంటే పచ్చిపాలు, కుంకుమపువ్వు, బాదం నూనె వంటి వాటిని ఉపయోగిస్తానని ఆమె తెలిపినట్లు సమాచారం. ప్రతిరోజూ చర్మ సంరక్షణకు సమయం కేటాయించడంతో పాటు, ఆకలి వేసినప్పుడే ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లకు ప్రాధాన్యం ఇస్తారని కథనం పేర్కొంది.
తమిళ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ వయసు పెరుగుతున్నా ఆమె అందం మాత్రం తరగడం లేదు. ఐదు పదుల వయసులో కూడా యువ హీరోయిన్లకు తీసిపోని గ్లామర్తో, చందమామలా మెరిసిపోతున్న ఆమె చర్మం వెనుక ఉన్న రహస్యం ఏంటని ఎవరికైనా ఆశ్చర్య కలగక మానదు. అయితే, తన అందానికి గల కారణాలను ఖుష్బూ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె ఎలాంటి ఖరీదైన క్రీములు కాకుండా, పూర్తిగా వంటింటి చిట్కాలనే నమ్ముతానని చెప్పారు. ఖుష్బూ తన సౌందర్యం కోసం పచ్చిపాలు, కుంకుమపువ్వు, బాదం నూనెలను క్రమం తప్పకుండా ఉపయోగిస్తానని తెలిపారు. ఉదయం 4.30 నుంచి 5 గంటల మధ్యలోనే నిద్రలేచే ఆమె.. ఇంట్లో అందరికీ టీ పెట్టే సమయంలోనే పచ్చిపాలను ముఖానికి రాసుకుంటారట. కొన్నిసార్లు కుంకుమపువ్వు నానబెట్టిన నీటిని, మరికొన్నిసార్లు బాదం నూనెతో ముఖానికి మసాజ్ చేసుకుంటానని చెప్పారు. దాదాపు ప్రతిరోజూ ఇలా అరగంట పాటు తన చర్మానికి తగిన సమయం కేటాయిస్తానని తెలిపారు. కేవలం చర్మ సంరక్షణే కాకుండా, తన ఆహారపు అలవాట్లపై కూడా ఆమె ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఆకలి వేసినప్పుడే ఆహారం తీసుకుంటారే తప్ప, కేవలం ఆనందం కోసం లేదా తినాలనే ఉద్దేశంతో ఎప్పుడూ అతిగా తిననని చెప్పారు. ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి, వంటింటి చిట్కాలే తన యవ్వన రూపానికి అసలైన రహస్యం అని ఆమె స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
థెరపీ చేయించుకుంటే ఇన్సూరెన్స్ ఇస్తారా?హెల్త్ పాలసీ తీసుకోబోయేముందు ఈ నిజాలు తెలుసుకోండి!
రూ.20 వేల జీతంతోనూ పర్సనల్ లోన్.. అర్హతలు ఏమిటి? ఎంతొస్తుందో తెలుసా?
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

