AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.20 వేల జీతంతోనూ పర్సనల్ లోన్.. అర్హతలు ఏమిటి? ఎంతొస్తుందో తెలుసా?

రూ.20 వేల జీతంతోనూ పర్సనల్ లోన్.. అర్హతలు ఏమిటి? ఎంతొస్తుందో తెలుసా?

Phani CH
|

Updated on: Oct 17, 2026 | 5:18 PM

Share

నెలకు రూ.20,000 జీతం సంపాదించే వారికి కూడా పర్సనల్‌ లోన్‌ పొందే అవకాశం ఉంది. అయితే ఎంత మొత్తం మంజూరవుతుందనేది క్రెడిట్‌ స్కోర్‌, ఉద్యోగ స్థిరత్వం, ప్రస్తుత ఈఎంఐలు, బ్యాంకు నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే అర్హత మెరుగుపడవచ్చు. కొన్ని సంస్థలు తక్కువ జీతానికీ రుణాలు అందించినా, వడ్డీ రేటు, ప్రాసెసింగ్‌ ఫీజు, నెలవారీ చెల్లింపులను పరిశీలించిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి.

చిన్న జీతంతోనూ పర్సనల్ లోన్‌ పొందడం నేడు సాధ్యమే. అత్యవసర ఖర్చుల కోసం చాలామంది బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఆశ్రయిస్తుంటారు. అయితే జీతం, క్రెడిట్ స్కోరు సరిపోతాయా అనే సందేహాలు సర్వసాధారణం. నెలకు రూ. 20,000 సంపాదిస్తున్నప్పటికీ వ్యక్తిగత రుణం పొందే అవకాశం ఉంటుంది. చాలా బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు తక్కువ జీతం ఉన్నవారికి కూడా లోన్లు అందిస్తున్నాయి. వ్యక్తిగత రుణాల ప్రధాన ఆకర్షణ ఏమిటంటే వాటికి ఎలాంటి హామీ అవసరం లేదు. కానీ మీ అర్హత, ఆదాయ స్థిరత్వం, క్రెడిట్ స్కోర్ వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. రూ. 20,000 నెలవారీ జీతంతో సాధారణంగా రూ. 1 లక్ష నుంచి రూ. 2.5 లక్షల వరకు రుణం పొందే వీలుంది. కొన్ని ప్రైవేట్ లేదా నాన్-బ్యాంకింగ్ సంస్థలు క్రెడిట్ స్కోర్‌ను బట్టి రూ. 5 లక్షల వరకు ఆఫర్ చేయవచ్చు. అయితే నెలవారీ చెల్లించే సామర్థ్యాన్ని బట్టి ఈ పరిమితి మారుతుంది. రుణ దరఖాస్తును ఆమోదించే ముందు బ్యాంకులు పలు అంశాలను బేరీజు వేస్తాయి. ఇందులో మొదటిది కనీస జీతం అవసరం. కొన్ని బ్యాంకులు కనీసం రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు డిమాండ్ చేస్తుంటాయి. మరికొన్ని బ్యాంకులు మాత్రం రూ. 20,000 సంపాదించే వారికి కూడా లోన్లు మంజూరు చేస్తాయి. ప్రత్యేకించి వారు పేరున్న కంపెనీలలో పనిచేస్తున్నా లేదా మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉన్నా ఈ సదుపాయం లభిస్తుంది. రుణ ఆమోదంలో క్రెడిట్ స్కోర్ అత్యంత ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఖచ్చితంగా 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే ఆమోదం పొందే అవకాశాలు మెరుగవుతాయి. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే రుణదాతలు తక్కువ మొత్తాన్ని ఇవ్వవచ్చు లేదా అధిక వడ్డీని వసూలు చేయవచ్చు. రూ. 20,000 జీతంతో ఉన్నవారు కొన్నిసార్లు రుణానికి అనర్హులుగా కూడా మారుతుంటారు. ప్రభుత్వ సంస్థలు లేదా బాగా స్థిరపడిన ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులను బ్యాంకులు ఎక్కువగా ఇష్టపడతాయి. దరఖాస్తుదారులకు కనీసం ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి. ప్రస్తుత ఉద్యోగంలో కనీసం ఆరు నెలలు పూర్తి చేసి ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏదైనా రుణం లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు ఉంటే వాటి వివరాలను పరిశీలిస్తారు. జీతంలో ఎంత భాగం ఇప్పటికే ఈఎంఐలకు కేటాయించబడిందో రుణదాతలు తనిఖీ చేస్తారు. మీ మొత్తం ఈఎంఐ నికర ఆదాయంలో 40 నుంచి 50 శాతం మించకూడదు. ఈ నిబంధనలన్నింటినీ సరిగ్గా బేరీజు వేసుకుని లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss Telugu 10: ప్రేమే ఆమెకు శాపంగా.. డేంజర్‌ జోన్‌లో లవ్ బర్డ్‌…!

దేశం వదిలిపోవాలంటూ.. బాలీవుడ్ హీరోకు నోటీసులు

The Raja Saab: రాజాసాబే కాదు.. ఈయన చెప్పిన రీజనూ ఫెయిలే

Salman Khan: మళ్లీ అదే చెత్త ప్రశ్న.. కరణ్ దెబ్బకు షాకైన సల్మాన్

నెట్‌ఫ్లిక్స్‌లో లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హవా.. దెబ్బకు కపిల్ శర్మ షో వెనక్కి!

Follow Us