AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశం వదిలిపోవాలంటూ.. బాలీవుడ్ హీరోకు నోటీసులు

దేశం వదిలిపోవాలంటూ.. బాలీవుడ్ హీరోకు నోటీసులు

Phani CH
|

Updated on: Oct 16, 2026 | 4:51 PM

Share

బాలీవుడ్‌ నటుడు, ఆమిర్‌ ఖాన్‌ మేనల్లుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు అక్టోబర్‌ 28లోగా భారత్‌ విడిచి వెళ్లాలని విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం (FRRO) నోటీసు జారీ చేసినట్లు వార్తలు వెల్లడించాయి. ముంబైలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొన్నందుకు వీసా, ఇమ్మిగ్రేషన్‌ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. అమెరికా పౌరుడైన ఇమ్రాన్‌ ఈ నోటీసును బాంబే హైకోర్టులో సవాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కథనాలు పేర్కొన్నాయి.

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు షాక్ ఇచ్చారు. అక్టోబర్ 28వ తేదీలోగా భారతదేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చారు. విదేశీ పౌరుడు కావడంతో దేశం విడిచి వెళ్లాలని.. నోటీసుల్లో స్పష్టంచేశారు. ఈ మేరకు విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం , ముంబై పోలీసు యంత్రాంగం ఆయనకు నోటీసులు జారీ చేసింది. రాజకీయ నిరసనల్లో పాల్గొని వీసా నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ సిటిజన్‌గా ఉన్న ఇమ్రాన్‌ఖాన్.. ముంబైలో CEC జ్ఞానేశ్‌కుమార్‌కి వ్యతిరేకంగా జరిగిన సీజేపీ నిరసనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులతో పాటు ఇమ్రాన్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌తో సహా పలువురిపై FIR నమోదు చేసిన పోలీసులు.. కొన్ని గంటల తర్వాత విడుదల చేశారు. అయితే.. ఇమ్రాన్‌ఖాన్‌ పాల్గొనడంపై బిజెపి నాయకుడు కిరీట్ సోమయ్య దీనిపై తీవ్రంగా స్పందిస్తూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరసత్వం కలిగిన విదేశీయుడని, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా , వీసా నిబంధనల ప్రకారం విదేశీ పౌరులు భారతదేశంలో ఎటువంటి రాజకీయ ఆందోళనలు లేదా నిరసనల్లో పాల్గొనకూడదని ఫిర్యాదులో తెలిపారు. దీనిపై విచారించిన పోలీసులు, ఓసీఐ కార్డు నిబంధనల ఉల్లంఘన క్రింద చర్యలు చేపడుతూ అక్టోబర్ 28 నాటికి దేశం వీడాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

The Raja Saab: రాజాసాబే కాదు.. ఈయన చెప్పిన రీజనూ ఫెయిలే

Salman Khan: మళ్లీ అదే చెత్త ప్రశ్న.. కరణ్ దెబ్బకు షాకైన సల్మాన్

నెట్‌ఫ్లిక్స్‌లో లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హవా.. దెబ్బకు కపిల్ శర్మ షో వెనక్కి!

లేడీ కంటెస్టెంట్ పై బూతు పురాణం.. రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపిన బిగ్ బాస్..

ఆ తెలుగు డైరెక్టర్.. కమిట్మెంట్ అడిగాడు!

Follow Us