AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెట్‌ఫ్లిక్స్‌లో లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హవా.. దెబ్బకు కపిల్ శర్మ షో వెనక్కి!

నెట్‌ఫ్లిక్స్‌లో లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హవా.. దెబ్బకు కపిల్ శర్మ షో వెనక్కి!

Phani CH
|

Updated on: Oct 16, 2026 | 4:45 PM

Share

హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ వెబ్‌సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌ 10 జాబితాలో అగ్రస్థానానికి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. హిందీలో పాపులర్‌ అయిన ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో’ను వెనక్కి నెట్టి ముందంజలో నిలిచిందని ప్రచారం జరుగుతోంది. బాబు డేగల దర్శకత్వం వహించిన ఈ కామెడీ సిరీస్‌లో హైపర్‌ ఆది, జీవన్‌ కుమార్‌, ఐశ్వర్య కీలక పాత్రల్లో నటించారు. తొలుత ఈటీవీ విన్‌లో విడుదలైన ఈ సిరీస్‌ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు కంటెంట్ సత్తా చాటుతోందా? మన తెలుగు కమెడియన్ హర్ష చెముడు లీడ్ రోల్లో.. జబర్దస్త్‌ ఫేం బాబు డైరెక్షన్లో తెరెకెక్కిన లీస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్‌సిరీస్‌.. ఏకంగా హిందీలో పాపులర్ అయిన కపిల్ శర్మ షోకే గట్టి పోటీ ఇస్తోంది! ఇప్పుడు ఇదే టాపిక్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్‌ గా మారింది. హర్ష చెముడు హీరోగా నటించిన ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వెబ్‌సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ రోజువారీ టాప్‌ 10 కార్యక్రమాల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. అంతేకాదు.. హిందీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి ఈ సిరీస్‌ ముందంజలో నిలిచింది. సాధారణంగా నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓటీటీ వేదికలపై హిందీ కంటెంట్‌కు ఎక్కువ ఆదరణ కనిపిస్తుంటుంది. అలాంటిది ఓ తెలుగు కామెడీ సిరీస్‌ టాప్‌ ప్లేస్‌కు చేరిందన్న వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఈ సిరీస్‌ విషయానికి వస్తే.. బాబు డేగల దర్శకత్వం వహించారు. హర్ష చెముడుతో పాటు హైపర్ ఆది, జీవన్ కుమార్, ఐశ్వర్య కీలక పాత్రల్లో నటించారు. వినోదానికి ప్రాధాన్యమిస్తూ రూపొందించిన ఈ సిరీస్‌ తొలుత ఈటీవీ విన్‌లో విడుదలైంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇలా మొత్తానికి.. తెలుగు కంటెంట్‌కు ఓటీటీల్లో పెరుగుతున్న ఆదరణకు ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మరో బెస్ట్ ఉదాహరణ అనే చెప్పొచ్చు. మరి మీరు ఈ సిరీస్‌ చూశారా? హర్ష చెముడు కామెడీ ఎలా అనిపించింది? కామెంట్‌ చేసి చెప్పండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లేడీ కంటెస్టెంట్ పై బూతు పురాణం.. రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపిన బిగ్ బాస్..

ఆ తెలుగు డైరెక్టర్.. కమిట్మెంట్ అడిగాడు!

ఆ వెదవలకు గట్టిగా బుద్ది చెప్పిన.. వేణు స్వామి భార్య

Rashmika Mandanna: విరోష్‌ గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాల దత్తత!

Follow Us