AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ వెదవలకు గట్టిగా బుద్ది చెప్పిన.. వేణు స్వామి భార్య

ఆ వెదవలకు గట్టిగా బుద్ది చెప్పిన.. వేణు స్వామి భార్య

Phani CH
|

Updated on: Oct 16, 2026 | 4:21 PM

Share

వేణు స్వామి భార్య వీణా శ్రీ వాణిపై ఓ నెటిజన్‌ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఆమె తీవ్రంగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నిస్తూ పంపిన మెసేజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు. ప్రసవ సమయంలో ఎదుర్కొన్న కష్టాలను ప్రస్తావిస్తూ మహిళల గౌరవం గురించి ఘాటుగా మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ప్రశ్నించిన ఆమెకు సోషల్‌ మీడియాలో పలువురు మద్దతు తెలుపుతున్నారు.

సోషల్ మీడియాలో తరచూ ట్రోలింగ్ ను ఎదుర్కొనే వారిలో వేణు స్వామి కూడా ఒకరు. ఆయన ఏ విషయంపై స్పందించనా, పోస్ట్ పెట్టినా కొందరు పని గట్టుకుని మరీ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్, వీడియోస్ చేస్తున్నారు. అయితే ఇవేవీ పట్టించుకోకుండా తన దారిలో తాను వెళుతున్నారు వేణు స్వామి. అయితే తాజాగా ఒక నెటిజన్ వేణు స్వామి భార్య వీణాశ్రీవాణినిని కూడా ట్రోల్ చేశాడు. ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. కానీ ఆమె మాత్రం సైలెంట్ గా ఉండిపోలేదు. సదరు నెటిజన్ కు తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటరిస్తూ ఓ వీడియో చేసింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక నెటిజన్ తనకు పంపిన మెసేజ్ తనను తీవ్రంగా బాధించిందని తను షేర్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చారు వీణ. “మీరు ఇంకా శీలవతేనా? మీ ఆయన మీద ఒట్టు వేసి చెప్పు” అంటూ అత్యంత అసభ్యకరంగా ఆ వ్యక్తి ప్రశ్నించినట్లు ఆమె ఆవేధన వ్యక్తం చేశారు.అలాంటి చీప్ మెసేజ్ చూసి తనకు కోపం వచ్చి వెంటనే ఆ యూజర్‌ను బ్లాక్ చేసినట్లు ఆమె వెల్లడించారు. ఆ నెటిజన్ అడిగిన ప్రశ్నకు వీణా శ్రీవాణి తనదైన శైలిలో ఘాటుగా బదులిచ్చారు. అవును, నేను శీలవతిని కాదు.. నేను ఒక పర్ఫెక్ట్ మహిళను. తొమ్మిది నెలలు బిడ్డను మోసి, కనే సమయంలో సిజేరియన్ కష్టమని వైద్యులు చెప్పినా.. ఆపరేషన్ కు ఓకే చెప్పాను. ఆ సమయంలో ఐసీయూలో నా చుట్టూ ఉన్న డాక్టర్లు, కంపౌండర్లు అందరూ మగవారే. మహిళల ప్రసవాలు, ఆసుపత్రి పరిస్థితుల గురించి కూడా అవగాహన లేకుండా మాట్లాడే ఇలాంటి వెధవల వల్ల దేశానికి ఒరిగేదేమిటి? ప్రతీ మనిషి తల్లి, చెల్లి, భార్య ప్రసవ వేదనను, ఈ కఠిన పరిస్థితులను దాటుకొచ్చిన వారే. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే కొందరు మాత్రం ఇంకా ఇలాంటి పాత చింతకాయ ఆలోచనల వద్దే ఆగిపోయి సమాజాన్ని వెనక్కు లాగుతున్నారు. నా మాటలు అందరు మగాళ్లను ఉద్దేశించినవి కాదు. కేవలం ఇలాంటి చీప్ మెసేజ్‌లు పెట్టే కొద్దిమంది పనికిమాలిన మనుషులకే వర్తిస్తాయి. మగవారంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ ఇలాంటి వారిని సమాజంలో ఎవరూ మార్చలేరు. జీవితాంతం ఇలాగే వెధవలుగా మిగిలిపోతారు’ అంటూ వీణా శ్రీవాణి సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఆమె రిలీజ్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు వేణు స్వామి భార్యకు మద్దతుగా నిలుస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ‘ట్రోలర్లకు సరైన బుద్ది చెప్పారంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika Mandanna: విరోష్‌ గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాల దత్తత!

Follow Us