AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ తెలుగు డైరెక్టర్.. కమిట్మెంట్ అడిగాడు!

ఆ తెలుగు డైరెక్టర్.. కమిట్మెంట్ అడిగాడు!

Phani CH
|

Updated on: Oct 16, 2026 | 4:37 PM

Share

తెలుగు సినిమా ‘మేం వయసుకు వచ్చాం’తో గుర్తింపు తెచ్చుకున్న నటి నీతి టేలర్‌ తన కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించినట్లు కథనం చెబుతోంది. మరో సినిమాలో అవకాశం ఇస్తానంటూ ఓ దర్శకుడు తనను ‘కమిట్‌మెంట్‌’ అడిగారని ఆమె ఆరోపించారు. ఆ ఫోన్‌ కాల్‌తో షాక్‌కు గురైన తాను వెంటనే కాల్‌ కట్‌ చేసి, ఆ నంబర్‌ను బ్లాక్‌ చేసినట్లు తెలిపారు. ఈ ఘటన తర్వాత దక్షిణాది సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పినట్లు సమాచారం.

సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించే నటీనటులకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి అప్పుడప్పుడు పలువురు సెలబ్రిటీలు బహిరంగంగా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ అంశం సినీ పరిశ్రమలో తరచూ చర్చకు వస్తుంటుంది. తాజాగా ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి నీతి టేలర్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. మరో సినిమా అవకాశం ఇస్తానంటూ ఓ దర్శకుడు తనను అసభ్యకరమైన కోరిక కోరాడని ఆమె తెలిపింది. తన బయటపెట్టిన ఈ చేదు నిజంతో ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. నీతి టేలర్ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే సినిమా ‘మేం వయసుకు వచ్చాం’. ఈ చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నీతి… ఆ తర్వాత తెలుగులో మరో రెండు సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో కనిపించి షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను సౌత్ సినిమాలు మానేయడానికి కారణం.. తన ఫస్ట్ తెలుగు సినిమా డైరెక్టరే అంటూ రివీల్ చేసింది. తనకు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చిన తెలుగు డైరెక్టర్.. మరో ప్రాజెక్ట్ గురించి మాట్లాడేందుకు ఆమెకు ఫోన్ చేశారని.. అయితే తనకు సెకండ్ ఛాన్స్ ఇచ్చేందుకు .. తనను కమిట్మెంట్ అడిగినట్టు చెప్పుకొచ్చింది నీతి. సినిమాలో నటించే అవకాశం కోసం ఇలాంటి షరతు విధించడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పుకొచ్చింది. మొదట దర్శకుడి మాటలు విన్న వెంటనే ఏం చేయాలో అర్థం కాలేదని నీతి టేలర్ చెప్పుకొచ్చింది. సదరు డైరెక్టర్ అలా మాట్లాడగానే వెంటనే ఫోన్ కట్ చేసి, ఆ వ్యక్తి నంబర్‌ను బ్లాక్ చేసినట్లు ఆమె తెలిపింది. ఆ తర్వాత కన్నీళ్లతో తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పుకున్నట్లు నీతి వెల్లడించింది. తనకు ఫోన్ చేసిన దర్శకుడు గతంలో ఇతర మహిళలతోనూ అనుచితంగా ప్రవర్తించిన సందర్భాలను ఉన్నప్పటికీ, తన విషయంలో అలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదని నీతి తెలిపింది. ఈ ఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని, దాని తర్వాత సౌత్‌ సినిమాల కంటే టెలివిజన్ రంగంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ వెదవలకు గట్టిగా బుద్ది చెప్పిన.. వేణు స్వామి భార్య

Rashmika Mandanna: విరోష్‌ గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాల దత్తత!

Follow Us