The Raja Saab: రాజాసాబే కాదు.. ఈయన చెప్పిన రీజనూ ఫెయిలే
ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా ఫలితంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సంక్రాంతి విడుదల తేదీ ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే సినిమా ఫలితానికి విడుదల సమయం ఒక్కటే కారణమా, లేక కథా కథనాలు కూడా ప్రభావం చూపాయా అనే చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ది రాజా సాబ్’ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. టి.జి. విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటించారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కానీ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా ప్రీమియర్స్ పడిన మొదటి ఆట నుంచే సినిమాకి నెగిటివ్ టాక్ బలంగా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది. దీంతో సినిమా రిజల్ట్ అయితే చాలా వరకు తేడా కొట్టింది. అయితే ఈ విషయం మీద తాజాగా స్పందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత విశ్వప్రసాద్.. తమ సినిమా కంటెంట్ బాగోకపోవడం కాదని, రిలీజ్ డేట్ విషయంలో కొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సంక్రాంతి సీజన్ కావడం వల్లే తమ సినిమా వర్కౌట్ అయి ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో లాజిక్ లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే కంటెంట్ అటూ ఇటూగా ఉన్నా కూడా సంక్రాంతికి రిలీజ్ అయిన ఎన్నో సినిమాలు అద్భుతాలు సృష్టించాయి. కానీ ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో రావడం వల్లే అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదని విశ్వప్రసాద్ పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆయన పోస్ట్మార్టం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించి ఉండాల్సిందని, ‘సీజన్ కరెక్ట్ కాదేమో’ అనే ఒక అభిప్రాయం సరైనది కాదేమో అని విశ్లేషకులు అంటున్నారు. అయితే మరి విశ్వప్రసాద్ ఏ అంశాలను బేరీజు వేసుకుని అలా అంచనాకు వచ్చారో మనకు తెలియదు కానీ, ఆయన మాట్లాడిన మాటలు మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salman Khan: మళ్లీ అదే చెత్త ప్రశ్న.. కరణ్ దెబ్బకు షాకైన సల్మాన్
నెట్ఫ్లిక్స్లో లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హవా.. దెబ్బకు కపిల్ శర్మ షో వెనక్కి!
లేడీ కంటెస్టెంట్ పై బూతు పురాణం.. రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపిన బిగ్ బాస్..
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

