Premada Oorali: కన్నడ ఇండస్ట్రీలో చిన్న సినిమా ‘ప్రేమద ఊరలి’ సెన్సేషన్
కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘ప్రేమద ఊరాలి’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నట్లు సమాచారం. ఎలాంటి స్టార్ హీరోలు లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, యష్ నటించిన ‘టాక్సిక్’ వసూళ్లను అధిగమించిందనే ప్రచారం జరుగుతోంది. గ్రామీణ జీవితం, కుటుంబ బంధాలు, ప్రేమ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. అయితే వసూళ్లకు సంబంధించిన గణాంకాలను అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
చిన్న సినిమాగా థియేటర్లలోకి అడుగుపెట్టి బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది కన్నడ చిత్రం ‘ప్రేమద ఊరాలి’. గ్లోబల్ స్టార్ యష్ నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ ‘టాక్సిక్’ రికార్డులనే బద్దలు కొట్టి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇంతటి విజయం సాధించడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి..? హావ్ ఏ లుక్. కన్నడ చిత్ర పరిశ్రమలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘ప్రేమద ఊరాలి’ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తుంది. కేవలం లక్షల రూపాయల వసూళ్లతో జర్నీ స్టార్ట్ చేసిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అంతేకాదు 2026లో కర్ణాటకలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా నిలిచింది. భారీ అంచనాల మధ్య, హై-బడ్జెట్‌తో థియేటర్లలోకి వచ్చిన యష్ ‘టాక్సిక్’ సినిమా ఆడియన్స్‌ను నిరాశపరిచింది. ఆ సినిమా కర్ణాటకలో సాధించిన లైఫ్‌టైమ్ వసూళ్లను, ఎటువంటి స్టార్ వాల్యూ లేని ‘ప్రేమద ఊరాలి’ కేవలం మూడు వారాల్లోనే క్రాస్ చేయటం ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చింది. దీంతో శాండల్‌వుడ్ బాక్సాఫీస్ హిస్టరీలోనే అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుందీ చిన్న సినిమా. 100 కోట్ల మార్క్‌ను ఈజీగా క్రాస్ చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. స్టార్స్ లేకపోయినా కథలో బలం ఉంటే వసూళ్లు వాటంతట అవే వస్తాయని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ప్రేమద ఊరాలి. సాంప్రదాయాలు నమ్మే తండ్రి నాగన్న, సిటీ లైఫ్ వద్దని వ్యవసాయాన్ని నమ్ముకున్న కొడుకు సంతు జీవితంలోకి అమెరికా నుంచి వచ్చిన రుక్మిణి ఎంట్రీ ఇవ్వడంతో ఏం జరిగిందనేదే సినిమా. కుటుంబ బంధాలు, అమాయకత్వంతో కూడిన ప్రేమను ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10 విన్నర్ ఎవరో తేల్చేసిన కౌశల్!
Weather Report: దసరా పండగ వేళ చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు
భార్యను లాడ్జ్‌కి తీసుకెళ్లాడు.. రాత్రంత్రా హ్యాపీగా ఉన్నారు.. ఉదయాన్నే బాత్రూంలో
Jabardasth Actor Babu: వా.. బాబు..! జబర్దస్త్ కమెడియన్ TO సక్సెస్ఫుల్ డైరెక్టర్!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

