AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తంగేడు పువ్వులకు వెళ్లి.. తీవ్ర గాయాలతో తిరిగొచ్చి వ్యక్తి.. విషయం తెలిసి షాక్!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సద్దుల బతుకమ్మ కోసం తంగేడు పువ్వులు తెంపడానికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. వంకాయల లక్ష్మణ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో స్థానిక రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొండ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లవద్దని, శబ్దాలు చేసుకుంటూ వెళ్లాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

తంగేడు పువ్వులకు వెళ్లి.. తీవ్ర గాయాలతో తిరిగొచ్చి వ్యక్తి.. విషయం తెలిసి షాక్!
Tangedu Flowers
G Sampath Kumar
| Edited By: |

Updated on: Oct 18, 2026 | 11:00 AM

Share

సద్దుల బతుకమ్మ కోసం పువ్వు తెంపేందుకు ఓ గుట్ట దగ్గరికి వెళ్ళాడు. కొద్ది దూరం వెళ్లి తంగేడు పువ్వు తెంపాడు. మరో ముందు అడిగేసి ఇంకాస్త తెంపే ప్రయత్నం చేశాడు. అప్పటికే అక్కడ ఉన్న ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. తీవ్ర గాయాలతో ఈద విధంగా బయటపడ్డారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రనికి చెందిన వంకాయల లక్ష్మణ్ అనే వ్యక్తి బతుకమ్మ పండుగ సందర్బంగా తంగేడు పువ్వు కోసం దగ్గరలో ఉన్న గుట్ట ప్రాంతానికి వెళ్లారు. అయితే అక్కడ అధికంగా తంగేడు చెట్టు ఉండడంతో పువ్వు తెంపేందుకు వెళ్లాడు. సహజంగా ఎలుగుబంట్లు ఉదయం పూట బయటికి రావు. కానీ తంగేడు పువ్వు తెంపుతున్న సమయంలోనే ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. తలతోపాటు చేయికి గాయమైంది. అతని అరుపులు విని పక్కనే ఉన్న రైతులు అక్కడికి వెళ్లారు. దాడి చేసిన ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్లిపోయింది. లక్ష్మణ్ కి తీవ్ర గాయాలు కావడంతో వేములవాడ ఆసుపత్రికి తరలించారు ..

అయితే ఈ గుట్ట సమీపంలో ఎలుగుబంట్లు ఉన్నాయని రైతులు చెప్తున్నారు. ఉదయం పూట మాత్రం బయటికి రావని సాయంత్రం అయితే గుట్ట నుంచి బయటికి వచ్చి పొలాల దగ్గరికి వస్తున్నాయని తెలుపుతున్నారు. గతంలో కూడా ఇక్కడ సంచరిస్తున్న ఎలుగుబంట్లను చూశామని అంటున్నారు. రైతుపైన దాడి చేయడంతో మిగతా రైతులందరూ భయంతో వణికి పోతున్నారు. ఇప్పుడు గుట్ట సమీపంలో ఉన్న పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు.

అయితే ఈ గుట్టపైనే పశువులు మేతకు వెళ్తుంటాయి. గొర్రెలు మేకలు కూడా ఇక్కడే మేపుతున్నారు. ఇప్పుడు రైతు పై దాడి చేయడంతో వెళ్లాలంటే భయపడుతున్నారు. నీటి కోసం తరచుగా పొలాలకు రావడంతో మొదలు పెట్టాలన్న కూడా రైతులు భయపడుతున్నారు. పండుగ పూట ఎలుగుబంటి దాడి చేయడంతో లక్ష్మణ్ కుటుంబంలో ఆవేదన కనబడుతుంది. అయితే మెరుగైన వైద్యం అందించి ఆయన ప్రాణాలు కాపాడాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కొండలు గుట్టలకు వెళ్లే సమయంలో ఒంటరిగా వెళ్లకూడదని గుంపులు గుంపులుగా వెళ్లాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా శబ్దాలు చేసుకుంటూ వెళ్లాలని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us