AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్ దర్శకులకు దూరం అవుతున్నారా లేదంటే పెడుతున్నారా..?

బాలీవుడ్ దర్శకులకు దూరం అవుతున్నారా లేదంటే పెడుతున్నారా..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 17, 2026 | 6:15 PM

Share

ఒకప్పుడు బాలీవుడ్‌ దర్శకులతో సినిమా అంటే పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉండేవి. కానీ ఇప్పుడు మన స్టార్‌ హీరోలు తెలుగు, తమిళ, మలయాళ దర్శకులతో సినిమాలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌, త్రివిక్రమ్‌తో ప్రాజెక్టులు చేస్తుండగా, రామ్‌ చరణ్‌ కూడా సుకుమార్‌ వంటి సౌత్‌ దర్శకుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బాలీవుడ్‌ దర్శకుల మార్కెట్‌ తగ్గుతోందా, లేక సౌత్‌ దర్శకుల ప్రభావం పెరుగుతోందా అనే చర్చ మొదలైంది.

ఒకప్పుడు బాలీవుడ్ దర్శకులతో సినిమా అంటే పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలు ఉండేవి.. కానీ ఇప్పుడు సీన్ మారుతోందా..? మన స్టార్ హీరోలు హిందీ దర్శకుల కంటే తెలుగు, తమిళ, మలయాళ దర్శకులతోనే సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఇది బాలీవుడ్‌కు ఎదురుదెబ్బా లేదంటే పెరిగిన సౌత్ దర్శకుల మార్కెట్‌కు నిదర్శనమా.. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 తర్వాత బాలీవుడ్ దర్శకులు అంటేనే ఆమడ దూరం వచ్చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్ చేస్తున్న ఈయన.. నెక్ట్స్ త్రివిక్రమ్‌తో గాడ్ ఆఫ్ వార్ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతానికి తారక్ ఫోకస్ అంతా సౌత్ దర్శకుల వైపే ఉంది. వార్ 2 అనుభవం ఎన్టీఆర్‌లో గట్టి మార్పులే తీసుకొచ్చింది. రామ్ చరణ్ కూడా అప్పుడెప్పుడో పుష్కరం కింద వచ్చిన జంజీర్ తర్వాత బాలీవుడ్ దర్శకులు అంటేనే నో అంటున్నారు. ప్రస్తుతం సుకుమార్‌తో సినిమా చేయబోతున్న చరణ్.. నెక్ట్స్ కూడా మన దర్శకులతోనే సినిమాలకు ఓకే అంటున్నారు. ఒకవేళ బాలీవుడ్‌కు వెళ్లాల్సి వచ్చినా.. మన సినిమాలతోనే వెళ్తానంటున్నారు రామ్ చరణ్. మొత్తానికి మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా టాప్ స్టార్స్ లైనప్‌లో సౌత్ దర్శకుల పేర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో మన దర్శకులు బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తూ తమ మార్కెట్‌ను విస్తరిస్తున్నారు. మరి సౌత్ హీరోలు బాలీవుడ్ దర్శకులను నమ్మట్లేదా లేదంటే పాన్ ఇండియా సినిమాలు మనోళ్లే తీయగలరని బలంగా నమ్ముతున్నారా అనేది చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10 విన్నర్ ఎవరో తేల్చేసిన కౌశల్!

Weather Report: దసరా పండగ వేళ చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు

భార్యను లాడ్జ్‌కి తీసుకెళ్లాడు.. రాత్రంత్రా హ్యాపీగా ఉన్నారు.. ఉదయాన్నే బాత్‌రూంలో

Jabardasth Actor Babu: వా.. బాబు..! జబర్దస్త్‌ కమెడియన్ TO సక్సెస్‌ఫుల్ డైరెక్టర్!

Published on: Oct 17, 2026 06:15 PM
Follow Us