43 ఏళ్ల వయసులో తరగని అందం.. త్రిష గ్లామర్ సీక్రెట్ ఇదే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

18 October 2026

వయసు 43 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ తరగని అందంతోపాటు గ్లామరస్ లుక్కులో జనాలను మెస్మరైజ్ చేస్తుంది అందాల భామ త్రిష.

వయసుతో సంబంధమే లేకుండా అటు సినిమాలు, ఇటు సోషల్ మీడియాలో లేటేస్ట్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తూ ఆశ్చర్యపరుస్తుంది ఈ భామ.

త్రిష ఫిట్నెస్ సీక్రెట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంత హెల్తీగా, ఫిట్‌గా ఉండటానికి గల ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ను వెల్లడించారు త్రిష.

మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, శరీరంలో ఫ్లెక్సిబిలిటీని పెంపొందించడానికి రోజువారీ జీవితంలో యోగా, మెడిటేషన్‌కు ప్రాధాన్యత ఇస్తారు.

సన్నని శరీర ఆకృతిని, మజిల్ టోన్‌ను కాపాడుకోవడానికి పుష్-అప్స్, స్క్వాట్స్, ప్లాంక్స్ వంటి బాడీవెయిట్ ఎక్సర్‌సైజులతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కవుట్స్ చేస్తారు.

శరీరం మొత్తానికి మంచి వ్యాయామం అందించేది ఈత త్రిషకు ఇష్టమైన వర్కవుట్. ఇది కార్డియో ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

శారీరక వ్యాయామంతో పాటు, త్రిష మానసిక శ్రేయస్సుకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంది. ధ్యానం  విశ్రాంతి పద్ధతులు ఆమె దినచర్యలో భాగం.

కేవలం వ్యాయామాలే కాకుండా, తాను తీసుకునే ఆహారం పట్ల త్రిష చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తగినంత నాణ్యమైన నిద్రకు పెద్దపీట వేస్తారు.