AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singeetham Srinivasa Rao: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ కన్నుమూత

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. చివరిగా ఆయన నాగ్ అశ్విన్ నిర్మాణంలో 'సింగ్ గీతం' అనే సినిమాకి దర్శకత్వం వహించారు. 94 ఏళ్ల వయసులోనూ దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా కోసం ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో కూడా సింగీతం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈక్రమంలోనే ఈ లెజెండరీ డైరెక్టర్ ఇలా తిరిగిరాని లోకాలకెళ్లడం ఇప్పుడందర్నీ షాక్‌కు గురిచేస్తోంది.

Singeetham Srinivasa Rao: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ కన్నుమూత
Legendary Filmmaker Singeetham Srinivasa Rao Passes Away
Anand T
|

Updated on: Oct 03, 2026 | 11:35 PM

Share

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాల మాంత్రికుడిగా పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.

సినీ ప్రస్థానం.. ప్రయోగాల బాట

సింగీతం శ్రీనివాసరావు 1931 సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు. కేవలం దర్శకుడిగానే కాకుండా రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా బహుముఖ ప్రతిభను చాటుకున్నారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన ఆయన తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో కలిపి మొత్తం 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.

సినిమా రంగంలో విభిన్నమైన ప్రయోగాలు చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. మాటలు (డైలాగులు) లేకుండా మూకీ తరహాలో ఆయన రూపొందించిన పుష్పక విమానం చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే ఆదిత్య 369, భైరవద్వీపం, విచిత్ర సోదరులు, మయూరి, మైఖేల్ మదన కామరాజు, అపూర్వ సహోదరులు, సొమ్మొకడిది సోకొకడిది వంటి ఎన్నో చిరస్మరణీయ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చివరి చిత్రం  సింగ్ గీతం 94 ఏళ్ల వయసులో కూడా ఆయన దర్శకత్వ బాధ్యతలు చేపట్టి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. చలనచిత్ర రంగానికి ఆయన చేసిన విశేష సేవలకు గాను రెండు జాతీయ పురస్కారాలు, 5 నంది అవార్డులతో పాటు పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. విలక్షణ దర్శకుడిగా భారతీయ తెరపై తనదైన చెరగని ముద్ర వేసిన సింగీతం శ్రీనివాసరావు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు.

సినీ ప్రముఖుల సంతాపం

సింగీతం శ్రీనివాస్ మృతిపై ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు..  ఆయన ఇక లేరనే వార్త తనకు చాలా బాధాకలిగించిందన్నారు. ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి… తరతరాలుగా కూడా తాజా అనుభూతిని కలిగించే చిత్రాలను అందించే తన కాలం కంటే ముందుగానే ఆలోచించిన దూరదృష్టి గల వ్యక్తి ఆయన అని.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిచేస్తున్నట్టు తెలిపాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us