AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెస్లే లో-ఫ్యాట్ డెయిరీ వైటనర్‌ విక్రయాలపై FSSAI నిషేధం

ఆహార భద్రతా ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. లో-ఫ్యాట్ డెయిరీ వైటనర్ విక్రయాలపై నిషేధం విధించింది. ప్రయోగశాలలో పరీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాన్ వెంటనే అమల్లోకి రానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మిరిన్ని వివరాలు ఇందులో చూద్దాం.

నెస్లే లో-ఫ్యాట్ డెయిరీ వైటనర్‌ విక్రయాలపై FSSAI నిషేధం
Nestle
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Oct 03, 2026 | 10:27 PM

Share

నెస్లే ఇండియా తయారు చేసిన లో-ఫ్యాట్ డెయిరీ వైటనర్ విక్రయాలను ఆహార భద్రతా ప్రాధికార సంస్థ (FSSAI) నిషేధించింది. న్యూఢిల్లీలోని ది లలిత్ హోటల్ నుంచి సేకరించిన నమూనాను ప్రయోగశాలలో పరీక్షించగా అది అసురక్షితం నాణ్యత ప్రమాణాలకు విరుద్ధంగా తేలినట్లు FSSAI ప్రకటించింది. నెస్లే లో-ఫ్యాట్ డెయిరీ వైటనర్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం నాన్-కంప్లయింట్‌గా గుర్తించబడింది. దీనిపై హోటల్ నిర్వహణ సంస్థకు నోటీసులు జారీ చేసి, సంబంధిత ఉత్పత్తి విక్రయాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ప్రయోగశాల నివేదిక కాపీని హోటల్ కి అందజేసి నిర్దేశిత గడువులోగా అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది.

ఇదిలా ఉండగా.. నెస్లే ఇండియా తమ ఉత్పత్తి పూర్తిగా సురక్షితమేనని, అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉందని స్పష్టం చేసింది. కంపెనీ ప్రకారం పాలలో సహజంగా ఉండే ఫాస్ఫరస్ కారణంగానే పరీక్షల్లో తేడా వచ్చి ఉండొచ్చు. ల్యాబ్ రిపోర్ట్‌లో మొత్తం ఫాస్ఫరస్‌ను జోడించిన ఫాస్ఫరస్ పరిమితితో పోల్చారు. కానీ పాల ఆధారిత పదార్థాల్లో సహజంగా ఉండే ఫాస్ఫరస్‌ను పరిగణనలోకి తీసుకోలేదని నెస్లే పేర్కొంది. కంపెనీ అధికారులతో సంప్రదిస్తూ, సహజ ఫాస్ఫరస్ ఉనికిని నిరూపించే డేటాను అందజేస్తున్నట్లు తెలిపింది.

Follow Us
నెస్లేకు షాక్.. లో-ఫ్యాట్ డెయిరీ వైటనర్‌ విక్రయాలపై బ్యాన్
నెస్లేకు షాక్.. లో-ఫ్యాట్ డెయిరీ వైటనర్‌ విక్రయాలపై బ్యాన్
తల్లికి వందనం రెండో విడతపై అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
తల్లికి వందనం రెండో విడతపై అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
ఏపీలో పింఛన్లు పొందుతున్నవారికి అలర్ట్.. డైరెక్ట్‌గా అకౌంట్లోకి..
ఏపీలో పింఛన్లు పొందుతున్నవారికి అలర్ట్.. డైరెక్ట్‌గా అకౌంట్లోకి..
ఆ చేతుల్లో ఏదో మాయ ఉన్నట్టుంది.. పాములను ఎలా కంట్రోల్ చేశాడో..
ఆ చేతుల్లో ఏదో మాయ ఉన్నట్టుంది.. పాములను ఎలా కంట్రోల్ చేశాడో..
ఎండుతున్న పంటలు.. ఇంకిపోయిన భూగర్భ జలాలు..
ఎండుతున్న పంటలు.. ఇంకిపోయిన భూగర్భ జలాలు..
ఆర్టీసీ బస్సుల్లో వారికి ఫ్రీ జర్నీ.. ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త..
ఆర్టీసీ బస్సుల్లో వారికి ఫ్రీ జర్నీ.. ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త..
ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ
ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ
గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేస్తే చాలు..
గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేస్తే చాలు..
అరెరె ఇంత ఈజీనా.. గుడ్డు మంచిదా.. కుళ్లిపోయిదా.. సెకన్లలో..
అరెరె ఇంత ఈజీనా.. గుడ్డు మంచిదా.. కుళ్లిపోయిదా.. సెకన్లలో..
జామ్ అయిన కుక్కర్ విజిల్‌ను ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి.
జామ్ అయిన కుక్కర్ విజిల్‌ను ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి.