AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalliki Vandanam: తల్లికి వందనం రెండో విడతపై బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి వచ్చేది అప్పుడే.. రెడీగా ఉండండి..

తల్లికి వందనం రెండో విడత నిధుల చెల్లింపు ప్రక్రియ తుది దశలో ఉంది. ఆగస్టు 30 నాటికి విడుదల కావాల్సిన నిధులు ఆలస్యమయ్యాయి. ఫైలు ఆర్థిక శాఖ ఆమోదం పొంది సీఎం కార్యాలయానికి పంపారు. ఈ నెలలో రెండో విడత నిధులు జమయ్యే ఛాన్స్ ఉంది.

Thalliki Vandanam: తల్లికి వందనం రెండో విడతపై బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి వచ్చేది అప్పుడే.. రెడీగా ఉండండి..
Thalliki Vandanam
Venkatrao Lella
|

Updated on: Oct 03, 2026 | 10:23 PM

Share

తల్లికి వందనం పథకం కింద రెండో విడత ఆర్థిక సాయం కోసం రాష్ట్రంలోని అనేకమంది తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. మొదటి విడతలో సాంకేతిక కారణాలతో ప్రయోజనం అందని విద్యార్థులుతో పాటు కొత్తగా ఒకటో తరగతి లేదా ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులు రెండో విడతలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా  జూలై 22న 64.76 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన తల్లికి వందనం నిధులను తల్లిదండ్రుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. ఒకటో తరగతి అడ్మిషన్లు, ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు, గత విడతలో సాంకేతిక కారణాలతో అందుకోనివారు మరో 2.7లక్షల మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరికీ రెండో విడత కింద ఆగస్టు 30న నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేదు. దీంతో సుమారు 3లక్షల మంది తల్లికి వందనం రెండో విడత నగదు కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే అక్టోబర్ తొలి వారం లేదా రెండో వారంలో రెండో విడత నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అయితే ఈ నిధులు అందుకోవాలంటే కొన్ని పనులు పూర్తి చేయాలి.  విద్యార్థి వివరాలు సరిగ్గా నమోదు చేయబడ్డాయో లేదో తనిఖీ చేయండి. విద్యార్థి, తల్లి ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. ఈ-కేవైసీ విషయంలో ఏమైనా సమస్య ఉందా అని చూడండి. బ్యాంక్ ఖాతా నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఖాతా ఆధార్‌తో అనుసంధానం సరిగ్గా ఉన్నాయో లేదో ధ్రువీకరించండి. విద్యార్థి పాఠశాల లేదా కాలేజీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకోండి. ఈ వివరాలను సంబంధిత సచివాలయం లేదా విద్యాశాఖ అధికారుల ద్వారా నిర్ధారించుకోవాలి.  చిన్న అజాగ్రత్త వల్ల ప్రయోజనం కోల్పోతే.. మళ్లీ అవకాశం వచ్చేందుకు తదుపరి విద్యా సంవత్సరం వరకు వేచి ఉండాల్సి వస్తుంది.

ఈ క్రమంలో ఖాతాదారులు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలని తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సరిదిద్దుకోవచ్చు. లేదా విద్యాశాఖ అధికారులను సంప్రదించి ప్రక్రియలను పూర్తి చేయవచ్చు. వివరాలన్నీ సరిగ్గా ఉంటే వెంటనే అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. లేకపోతే వచ్చే విద్యా సంవత్సరం వరకు వేచి ఉండాల్సిన అవసరం రావొచ్చు. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు ప్రభుత్వం అందిస్తోంది. వాటిల్లో రూ.2 వేలు పాఠశాలల నిర్వహణ కోసం కట్ చేస్తుంది. మిగతా రూ.13 వేలు అందిస్తోంది.

Follow Us
తల్లికి వందనం రెండో విడతపై అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
తల్లికి వందనం రెండో విడతపై అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
ఏపీలో పింఛన్లు పొందుతున్నవారికి అలర్ట్.. డైరెక్ట్‌గా అకౌంట్లోకి..
ఏపీలో పింఛన్లు పొందుతున్నవారికి అలర్ట్.. డైరెక్ట్‌గా అకౌంట్లోకి..
ఆ చేతుల్లో ఏదో మాయ ఉన్నట్టుంది.. పాములను ఎలా కంట్రోల్ చేశాడో..
ఆ చేతుల్లో ఏదో మాయ ఉన్నట్టుంది.. పాములను ఎలా కంట్రోల్ చేశాడో..
ఎండుతున్న పంటలు.. ఇంకిపోయిన భూగర్భ జలాలు..
ఎండుతున్న పంటలు.. ఇంకిపోయిన భూగర్భ జలాలు..
ఆర్టీసీ బస్సుల్లో వారికి ఫ్రీ జర్నీ.. ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త..
ఆర్టీసీ బస్సుల్లో వారికి ఫ్రీ జర్నీ.. ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త..
ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ
ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ
గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేస్తే చాలు..
గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేస్తే చాలు..
అరెరె ఇంత ఈజీనా.. గుడ్డు మంచిదా.. కుళ్లిపోయిదా.. సెకన్లలో..
అరెరె ఇంత ఈజీనా.. గుడ్డు మంచిదా.. కుళ్లిపోయిదా.. సెకన్లలో..
జామ్ అయిన కుక్కర్ విజిల్‌ను ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి.
జామ్ అయిన కుక్కర్ విజిల్‌ను ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి.
మరీ ఎక్కువ అందంగా ఉందని సినిమాల్లో నుంచి తీసేశారు..
మరీ ఎక్కువ అందంగా ఉందని సినిమాల్లో నుంచి తీసేశారు..