AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. వారికి బస్సుల్లో ఫ్రీ జర్నీ.. రూ.2 వేలు కూడా..

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుల అద్దె సేవలను ప్రకటించింది. గ్రూపులుగా వెళ్లే భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సురక్షితమైన ప్రయాణం వంటి ప్రయోజనాలను పొందవచ్చు. ఉచిత ప్రయాణంతో పాటు కమిషన్ కూడా పొందవచ్చు. ఎలా అనేది చూద్దాం.

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. వారికి బస్సుల్లో ఫ్రీ జర్నీ.. రూ.2 వేలు కూడా..
Apsrtc
Venkatrao Lella
|

Updated on: Oct 03, 2026 | 9:46 PM

Share

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లే భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ శుభవార్తను ప్రకటించింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు, టూర్ ప్యాకేజీలతో పాటు గ్రూపులుగా వెళ్లే వారికి బస్సులను అద్దెకు తీసుకునే వినూత్న సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలు అయ్యప్ప భక్తుల యాత్రను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ అందించే అద్దె బస్సు సేవలు భక్తులకు అనేక ప్రయోజనాలను కల్పిస్తాయి. కనీసం ఐదు రోజుల పాటు బస్సును అద్దెకు తీసుకున్నట్లయితే గురుస్వాములకు రూ. 2 వేల కమిషన్‌తో పాటు ఏడుగురు సహయకులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారు.

ఏడుగురికి ఫ్రీ జర్నీ

అద్దెకు తీసుకున్న బస్సుతో పాటు ప్రయాణించే ఏడుగురు వ్యక్తులకు ఉచిత టికెట్లు అందిస్తారు. ఇందలో భాగంగా  వంటవారు, మణికంఠలు, ఇతర సహయకులకు ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుంది. అన్ని అద్దె బస్సులలో ఆడియో, వీడియో సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఇది సుదూర ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో సురక్షితమైన ప్రయాణం చేయవచ్చు. అనుభవజ్ఞులైన డ్రైవర్లు అందుబాటులో ఉంటారు. సమయపాలనతో కూడిన ప్రయాణం, ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు ఏపీఎస్ఆర్టీసీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రైవేటు బస్సుల కంటే ఆర్టీసీ బస్సులలో ప్రయాణం మరింత సురక్షితమని అధికారులు చెబుతున్నారు.

అద్దె ధరలు ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ

వివిధ రకాల బస్సులకు కిలోమీటర్‌కు అద్దె ధరలను ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అమరావతి ఏసీ బస్సుకు రూ. 120, ఇంద్రా ఏసీ బస్సుకు రూ. 75, స్టార్ లైనర్‌కు రూ. 66, సూపర్ లగ్జరీకి రూ. 57, అల్ట్రా డీలక్స్‌కు రూ. 61, ఎక్స్‌ప్రెస్‌కు రూ. 62, సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌కు రూ. 62, అల్ట్రా పల్లెవెలుగుకు రూ. 62, పల్లెవెలుగుకు రూ. 52 వసూలు చేయనున్నారు. ఈ అద్దె ధరలపై అదనంగా 5% జీఎస్టీ వర్తిస్తుంది. భక్తులు తమ అవసరాన్ని బట్టి బస్సు రకాన్ని ఎంచుకోవచ్చు. బస్సులను అద్దెకు తీసుకోవాలనుకునే భక్తులు తమకు దగ్గరలోని ఏపీఎస్ఆర్టీసీ డిపోను సంప్రదించవచ్చు. డిపో అధికారులు అద్దె సేవలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తారు. ప్రత్యామ్నాయంగా ఏపీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి కూడా సమాచారం తెలుసుకోవచ్చు. కాల్ సెంటర్ నంబర్ సాధారణంగా ఏపీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్, యాప్‌లలో అందుబాటులో ఉంటుంది.  శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న అయ్యప్ప భక్తులు, గ్రూపులుగా వెళ్లే వారు ఈ ప్రత్యేక సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ కోరుతోంది. పూర్తి వివరాల కోసం ఏపీఎస్ఆర్టీసీని సంప్రదించాలని కోరింది.

Follow Us