తిరుమల లడ్డూ చరిత్ర తెలుసా? మొదట లడ్డూ కాదు.. ఈ ప్రసాదమే భక్తులకు అందించేవారు..!

28 July 2026

Rajashekher

నేడు శ్రీవారి ఆలయంలో భక్తులకు అందించే ఈ లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు.. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీక.

తిరుమల లడ్డూ ప్రపంచ ప్రసిద్ధి

 చారిత్రక ఆధారాల ప్రకారం క్రీ.శ. 830 ప్రాంతంలో పల్లవుల పాలనలో తిరుమల ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాదం అందించే పద్ధతి ప్రారంభమైనట్లు పేర్కొంటారు.

పల్లవుల కాలంలో ప్రసాద సంప్రదాయం

ఆ రోజుల్లో తిరుమల కొండను చేరుకోవడానికి అనేక రోజులు పట్టేది. దర్శనం అనంతరం కొంతకాలం అక్కడే బస చేసే భక్తులకు ఆలయ అధికారులు ఆహారం, ప్రసాదం అందించేవారు.

భక్తుల అవసరాల కోసం అన్నప్రసాదం

ప్రారంభ దశలో భక్తులకు 'తిరుప్పొంగం' అనే ప్రసాదాన్ని అందించేవారు. అనంతరం కాలానుగుణంగా వివిధ రకాల నైవేద్యాలను ప్రవేశపెట్టారు.

మొదట 'తిరుప్పొంగం' ప్రసాదం

క్రీ.శ. 1445లో సుఖీయం, 1455లో అప్పం, 1460లో వడ, 1468లో అధిరసం, 1547లో మనోహరం వంటి ప్రసాదాలను శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంపిణీ చేశారు.

కాలక్రమంలో కొత్త ప్రసాదాల ప్రవేశం

మద్రాసు సంస్థానం అమలు చేసిన కొత్త ప్రసాద పంపిణీ విధానంలో భాగంగా క్రీ.శ. 1803 నుంచి భక్తులకు బూందీని ప్రసాదంగా అందించడం ప్రారంభమైంది.

1803లో బూందీ ప్రసాదం.

బూందీకి బదులుగా 1940లో తిరుపతి లడ్డూను అధికారిక ప్రసాదంగా ప్రవేశపెట్టారు. ఆ రోజుల్లో ఒక లడ్డూ ధర ఎనిమిది అణాలు మాత్రమే ఉండేది.

1940లో తిరుపతి లడ్డూ ఆవిర్భావం

ప్రస్తుతం తిరుపతి లడ్డూ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రసాదంగా గుర్తింపు పొందింది. అలాగే శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు మాత్రమే అందించే ప్రత్యేక ప్రసాదంగా కళ్యాణోత్సవ లడ్డుకు విశిష్ట స్థానం ఉంది.

కళ్యాణోత్సవ లడ్డు