AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్.. ఆ ఇళ్ల రిజిస్ట్రేషన్‌కు కొత్త పోర్టల్..!

గృహా నిర్మాణ శాఖ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం కొంతమంది లబ్ధిదారులు అసలు మొత్తాన్ని మాత్రమే చెల్లించగా, మరికొందరు వడ్డీతో సహా చెల్లించినట్లు తెలిపారు. కొందరు పూర్తి బకాయిలను చెల్లించినప్పటికీ ఇప్పటికీ దాదాపు 5 వేల రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.

తెలంగాణ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్.. ఆ ఇళ్ల రిజిస్ట్రేషన్‌కు కొత్త పోర్టల్..!
Minister Panguleti Srinivas Reddy
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Mar 07, 2026 | 9:57 PM

Share

తెలంగాణ హౌసింగ్ బోర్డు ద్వారా లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లు, ప్లాట్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సుమారు 5 వేల రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని గృహనిర్మాణ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అమల్లో ఉన్న నిబంధనలు, లబ్ధిదారులు చెల్లించిన అసలు మొత్తాలు, వడ్డీలు, ప్రస్తుత మార్కెట్ ధరలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

శనివారం (మార్చి 07) గృహా నిర్మాణ శాఖ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం కొంతమంది లబ్ధిదారులు అసలు మొత్తాన్ని మాత్రమే చెల్లించగా, మరికొందరు వడ్డీతో సహా చెల్లించినట్లు తెలిపారు. కొందరు పూర్తి బకాయిలను చెల్లించినప్పటికీ ఇప్పటికీ దాదాపు 5 వేల రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు.

తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGHCL) రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక పోర్టల్‌తో పాటు ఈ పోర్టల్ ద్వారా లబ్ధిదారులు ఇళ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం, చెల్లింపుల ధృవీకరణలు పొందడం, ఇతర ఆస్తి సంబంధిత సేవలను కార్యాలయాలకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే పొందేలా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. డిజిటల్ రిజిస్ట్రేషన్ల ద్వారా పారదర్శకత పెరుగడంతో పాటు సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయని, హౌసింగ్ బోర్డుపై ప్రజల నమ్మకం కూడా పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో హౌసింగ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ వి.పీ. గౌతమ్, చీఫ్ ఇంజినీర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us