AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వెబ్ సిరీస్ హీరోయిన్‌గా చేస్తానని యువతికి వేధింపులు.. యువకుడిపై కేసు నమోదు

Hyderabad: ఆడిషన్ పేరుతో కారులో తీసుకెళ్లి అసభ్యకర డైలాగులు, సన్నివేశాలు చెప్పించుకుని వీడియోలు షూట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆ వీడియోలను తన ఫేస్‌బుక్ ఖాతాలో అప్‌లోడ్ చేశాడని తెలుస్తోంది. ఈ వీడియోలు యువతి తల్లిదండ్రులకు చేరడంతో వాటిని తొలగించాలని..

Hyderabad: వెబ్ సిరీస్ హీరోయిన్‌గా చేస్తానని యువతికి వేధింపులు.. యువకుడిపై కేసు నమోదు
Case Filed
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Mar 07, 2026 | 9:52 PM

Share

Hyderabad: వెబ్ సిరీస్‌లో అవకాశం ఇస్తానని చెప్పి ఓ యువతిని మోసం చేసి వేధించిన ఘటన జూబ్లీహిల్స్‌లో వెలుగుచూసింది. కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన యువతి సినిమాల్లో నటించాలనే ఆశతో హైదరాబాద్‌కు వచ్చి యూసుఫ్‌గూడలో ఫ్రెండ్‌తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు శంకర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌నని చెప్పి వెబ్ సిరీస్‌లో అవకాశం ఇస్తానని నమ్మించాడు.

ఆడిషన్ పేరుతో కారులో తీసుకెళ్లి అసభ్యకర డైలాగులు, సన్నివేశాలు చెప్పించుకుని వీడియోలు షూట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆ వీడియోలను తన ఫేస్‌బుక్ ఖాతాలో అప్‌లోడ్ చేశాడని తెలుస్తోంది. ఈ వీడియోలు యువతి తల్లిదండ్రులకు చేరడంతో వాటిని తొలగించాలని కోరగా నిందితుడు నిరాకరించడమే కాకుండా, మరిన్ని సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేస్తానంటూ బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us