AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిమ్మరాజుపల్లి టీవీ నుంచి సూపర్ సాంగ్.. హృదయాలను టచ్ చేస్తున్న సాంగ్

హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. ఆసక్తికర ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ క్రేజీ సాంగ్ ను విడుదల చేశారు. 'నిజమేనా' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.. ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

తిమ్మరాజుపల్లి టీవీ నుంచి సూపర్ సాంగ్.. హృదయాలను టచ్ చేస్తున్న సాంగ్
Thimmarajupalli Tv
Rajeev Rayala
|

Updated on: Apr 04, 2026 | 7:41 PM

Share

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న తిమ్మరాజుపల్లి టీవీ మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. తిమ్మరాజుపల్లి టీవీ చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను ఎమోషనల్ ఫీల్ తో వంశీకాంత్ రేఖన కంపోజ్ చేశారు. సనరే లిరిక్స్ రాయగా, యువ గాయని జయశ్రీ పల్లెం పాడారు.

‘నిజమేనా నిజమేనా నే విన్నది నిజమేనా, నువు పలికిన ఆ మాటే పొరబడి విన్నానా, నిజమేనా నిజమేనా నువ్వన్నది నిజమేనా కను తెరిచి నీ ముందే కలనే కన్నానా, ప్రతి క్షణం నీ వెంటే ఇన్నాళ్లుగా తిరిగానే, నేనేమిటో కొంచెం కూడా అర్థం కాలేదా…’ అంటూ హార్ట్ టచింగ్ గా సాగుతుందీ పాట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us