ఆ ఫోటోస్ చూస్తే నాకు భయమేసింది.. టాలీవుడ్ హీరోయిన్ శ్రియా శరణ్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

13 October 2026

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ  ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారో చెప్పక్కర్లేదు.

ముఖ్యంగా సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చిత్రాలను వైరల్ చేయడం పెద్ద కలవరపాటుకు గురిచేస్తోంది. 

తాజాగా జాన్వీ కపూర్‌కు సంబంధించిన మార్ఫింగ్ వీడియో నెట్టింట తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై శ్రియా స్పందించారు.

ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో శ్రియా శరన్ మాట్లాడుతూ టెక్నాలజీ వల్ల సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బయటపెట్టారు.

కేవలం ఇతర హీరోయిన్లే కాకుండా, తన వ్యక్తిగత ఫొటోలను సైతం కొందరు అసాంఘిక శక్తులు అత్యంత దారుణంగా మార్ఫింగ్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీని తప్పుగా ఉపయోగించి మహిళా సెలబ్రిటీల పరువు తీసేలా ప్రవర్తించడం చాలా హేయమైన చర్య అని ఆమె మండిపడ్డారు.

శారీరక ఆకృతిని పెంచేస్తూ.. వేసుకున్న దుస్తులు మార్చేస్తూ.. చాలా దారుణంగా మార్ఫింగ్‌ చేస్తుంటారు. ఇది బాధాకరమని చెప్పుకొచ్చారు శ్రియా.

టెక్నాలజీ అనేది మనుషులకు సహాయం చేయడానికి ఉపయోగపడాలి తప్పా.. ఓ మహిళ గౌరవాన్ని దెబ్బతీయడానికి కాదు అని మండిపడ్డారు.