చాణక్య నీతి : సంపద వెంట పడి, మనశ్శాంతి కోల్పోతున్నారా?
Samatha
04 April 2026
ఈ మధ్య కాలంలో చాలా మంది సంపాదించడంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కొంత మంది టైమ్‌కి సరిగ్గా తినకపోయినా, ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలని ఆరాట పడుతున్నారు.
సంపాదన
సంపాదనపై పడి మనశ్శాంతి కోల్పోతున్నారు. ఇలాంటి వారి కోసం చాణక్యుడు అద్భుతమైన నీతి వ్యాఖ్యలు తెలిపాడు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
మనశ్శాంతి
చాలా మంది సంపద, విజయం అని పాకులాడుతుంటారు. కానీ నిజంగా నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుంతుందో ఆలోచించారా? అని చెబుతున్నాడు.
విజయం, సంపాదన
చాణక్యుడు తన నీతి శాస్త్రంలో సంతృప్తి, మానసిక ప్రశాంతత కంటే విలవైన సంపద లేదు, నిజమైన సంపద మనశ్శాంతి అని చెప్పుకొచ్చాడు.
మానసిక ప్రశాంతత
మరింత కావాలనే ఆలోచన ఒక వ్యక్తిని ఎప్పటికీ సంతోషకరంగా, సంతృప్తిగా ఉండనివ్వదు. ఇది దురాశను ప్రేరేపిస్తుంది. కాబట్టి, ఆశ, అత్యాశ ఉండకూడదు.
ఆశ, అత్యాశ
డబ్బు, భౌతిక సంపదలు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి. కానీ నిజమైన సంపద మీరు సంతృప్తిగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండటమే.
డబ్బు
చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి జీవితంలో నిజమైన సంపద సంతృప్తి. సంపాదన కన్నా, సంతృప్తి చాలా ముఖ్యం అని ఆయన తెలియజేస్తున్నాడు.
సంతృప్తి
ఎవరు అయితే తమ పరిస్థితులను అంగీకరించి, కష్టపడి పనిచేస్తూ, తమకమన్నదానితో సంతృప్తిగా ఉంటారో, అలాంటి వారు మాత్రమే నిజంగా సంతోషంగా, విజయవంతంగా ఉంటాడు.