తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2010లో స్టూడియో ఎన్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2012 నుండి 2017వరకు ఐ న్యూస్ లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశాను. ఆ తర్వాత 2017 నుంచి టీవీ9లో సీనియర్ కరెస్పాండంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 14 ఏళ్ల రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన కథనాలను అందించాను. నేను అందించిన ‘కత్తెర చేతబట్టిన చదువుల సరస్వతి’ కథనానికి గాను ప్రతిష్టాత్మక UNICEF అవార్డు అందుకున్నాను. అలానే 2019లో అప్పటి హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదగా ఉత్తమ క్రైమ్ రిపోర్టర్ అవార్డు అందుకున్నాను.
iBOMMA Ravi: క్యూబ్ నెట్‌వర్క్‌ను సైతం హ్యాక్ చేసిన ఐబొమ్మ రవి..!
ఐబొమ్మ రవి ఎట్టకేలకు నోరువిప్పాడు. మూడోసారి కస్టడీలోకి రవిని ఇచారించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. రవి పైరసీ నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. ఈ విచారణలో రవిపైరసీ నెట్వర్క్, బెట్టింగ్ యాప్స్‌తో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. ..
- Ranjith Muppidi
- Updated on: Dec 18, 2025
- 10:05 pm
సిడ్నీ బాండీ బీచ్ ఉగ్రదాడికి హైదరాబాద్ లింకులు
ఆస్ట్రేలియా లోని సిడ్నీ బాండీ బీచ్ ఉగ్రదాడి కేసులో హైదరాబాద్ లింకులు బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. బీచ్‌లో తన కుమారుడు నవీద్ అక్రమ్‌తో కలిసి కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్‌గా గుర్తించారు. సాజిద్ అక్రమ్ దగ్గర భారత పాస్‌పోర్ట్ లభించింది. 25 ఏళ్ల క్రితం సాజిద్ స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడినట్టు గుర్తించారు.
- Ranjith Muppidi
- Updated on: Dec 16, 2025
- 5:16 pm
Hyderabad: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్ద పొలీస్ పికెటింగ్ ఏర్పాటు! అంతేకాదు..
నిరసనలు, హెచ్చరికల మధ్య హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముందే మొదలైన వివాదాల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయగా, ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. .. .. ..
- Ranjith Muppidi
- Updated on: Dec 15, 2025
- 9:54 pm
Hyderabad: నగరంలో న్యూ ఇయర్ వేడుకలకు ప్రిపేర్ అవుతున్నారా..? ముందు ఇది తెలుసుకోండి
నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో హోటళ్లు, క్లబ్‌లు, బార్ల నిర్వహణపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత ఈవెంట్లు నిర్వహించాలంటే ముందస్తు పోలీసు అనుమతి తప్పనిసరి. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి ..
- Ranjith Muppidi
- Updated on: Dec 13, 2025
- 6:29 pm
Hyderabad: స్కూలే కాదు.. ట్యూషన్‌లోనూ విద్యార్థుల పాలిట యములైన టీచర్స్.. సరిగ్గా చదవట్లదేని ఏకంగా..
స్కూల్లోనే కాదు.. ట్యూషన్‌లోనూ విద్యార్థులకు తిప్పటు తప్పడం లేదు. హైదరాబాద్‌లో ఓ ట్యూషన్ టీచర్ ఏడేళ్ల చిన్నారిపై రాక్షసంగా ప్రవర్తించింది. సరిగ్గా చదవడం లేదన్న కారణంతో అట్లకాడను వేడి చేసి బాలుడికి వాతలు పెట్టింది. దీంతో ఆ అబ్బాయికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన ఫిల్మ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
- Ranjith Muppidi
- Updated on: Dec 12, 2025
- 9:30 pm
Hyderabad: ఆ ఒక్క పనితో.. సైబర్ మోసానికి గురై పోగొట్టుకున్న డబ్బు తిరిగి రాబట్టుకున్నారు..
ఈ మధ్య చోర్ గాళ్లు ఎంత స్మార్ట్ అయ్యారో చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం మన లైఫ్ అంతా డిజిటల్‌కి ముడి పడి ఉండటంలో.. వారి మాయలు ఈజీ అయిపోయాయి. ఇలా ఎవరైన తెలియక డబ్బు పోగొట్టుకుంటే.. ఆ మొత్తాన్ని తిరిగి పొందేందుకు ఒకే ఒక అస్త్రం ఉంది.
- Ranjith Muppidi
- Updated on: Dec 12, 2025
- 7:44 pm
Hyderabad: అయ్యో ఎంత ఘోరం.. పిల్లనిస్తామని ఇంటికి పిలిచారు.. ఆ తర్వాతే అసలు రూపం బయటపెట్టారు!
Hyderabad Crime: ప్రేమించిన అమ్మాయి కోసం వెళ్లిన ఓ యువకుడి ప్రాణం పోయింది.పెళ్లి చేస్తామని నమ్మించి ఇంటికి పిలిచిన అమ్మాయి కుటుంబసభ్యుల చేతిలో ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ దుర్మరణం చెందాడు. హైదరాబాద్ పటాన్చెరు లక్ష్మీనగర్‌లో బుధవారం రాత్రి ఈ సంచలన ఘటన చోటుచేసుకుంది.
- Ranjith Muppidi
- Updated on: Dec 10, 2025
- 9:44 pm
Hyderabad: ఆరి బడవల్లారా.. డెలివరీ బాయ్స్ అనుకుంటే.. మీరు చేసే యవ్వారం ఇదా..
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి... చదువులమ్మ చెట్టు నీడన ఇక్కడే కలిశాం అన్నట్లుగా.. వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి పేరున హైదరాబాద్‌కు వచ్చి గంజాయి అమ్మకాల ముఠాగా ఏర్పడి గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్న గంజాయి అమ్మకాలను ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ గుట్టు రట్టు చేసింది.
- Ranjith Muppidi
- Updated on: Dec 10, 2025
- 8:07 pm
Hyderabad: మార్కెట్ బిల్డింగ్ పై నుంచి గుప్పుమన్న వాసన.. ఏంటని చూడగా షాక్.!
ట్రాన్స్పోర్ట్ కష్టంగా మారింది. పోలీసులు రైళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నారు. దీంతో వారి దందా సాగడం లేదు. అక్కడి నుంచి.. ఇక్కడి తేవడం రిస్క్ ఎందుకు అనుకున్నారు. టెర్రస్‌పైనే తమ ప్లాన్ అమలు చేశారు. చివరికి పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ మలక్‌పేట్ మహబూబ్ మిషన్ మార్కెట్లోని ఒక భవనంలోని టెర్రస్‌లో గంజాయి మొక్కలు పెంచుతున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Dec 6, 2025
- 12:34 pm
Telangana: రూ.25 కడుతుంటే రూ. 2.49 లక్షలు పోయాయి..హైదరాబాద్‌లో నయా మోసం
హైదరాబాద్‌లో డెలివరీ ఛార్జీల పేరుతో కొత్త సైబర్ మోసం వెలుగుచూసింది. ఓ వ్యక్తి డీహెచ్ఎల్ కొరియర్ స్కామ్‌లో రూ.2.49 లక్షలు కోల్పోయాడు. ఒక్క లింక్‌తో కేటుగాళ్లు అకౌంట్ ఖాళీ చేశారు. ఫెయిల్డ్ డెలివరీ SMS లింక్‌లను నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.
- Ranjith Muppidi
- Updated on: Dec 5, 2025
- 8:40 pm
Telangana: ఒక్కసారి వాటి జోలికి వెళ్తే.. జీవితాలు నాశనమే.. నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న శిక్షలు!
తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన వైఖరితో ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో శిక్షలు పెరుగుతుండటం నిందితుల్లో భయాందోళనలు పెంచుతోంది. నేరాలు తగ్గాలంటే శిక్షలు తప్పనిసరి అనే నమ్మకంతో ఎక్సైజ్ యంత్రాంగం విచారణ నుంచి పంచానామా, చార్జీషీట్ దశల వరకూ పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తోంది.
- Ranjith Muppidi
- Updated on: Dec 4, 2025
- 9:20 pm
iBomma Ravi: ఐబొమ్మ రవికి జాబ్ ఆఫర్‌పై స్పందించిన డీసీపీ
ఐబొమ్మతో ఫిల్మ్ ఇండస్ట్రీకే సిన్మా చూపించిన మాస్టర్‌మైండ్ రవి నుంచి అనేక విషయాలు రాబట్టారు పోలీసులు. రవి ఒక్కడే పైరసీ చేసినట్టు గుర్తించారు. సినిమాలను పైరసీ చేసి 5 ఏళ్లల్లో 100 కోట్ల రూపాయలు వరకు సంపాదించినట్టు తేల్చారు. 20 కోట్ల రూపాయలకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. టెలిగ్రామ్ యాప్‌ల ద్వారా పైరసీ సినిమాలను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.
- Ranjith Muppidi
- Updated on: Dec 4, 2025
- 5:20 pm