AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పనిమనిషిని ఇంటి మనిషిగా అనుకుంటే.. యజమాని దిమ్మతిరిగే షాకిచ్చింది

బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు ఆరోపణలు రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… బాదంగ్‌పేట్‌కు చెందిన అల్లు తేజస్వి(43) హబ్సిగూడలో నివసించే ఓ డాక్టర్ ఇంట్లో పని చేసేది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Hyderabad: పనిమనిషిని ఇంటి మనిషిగా అనుకుంటే.. యజమాని దిమ్మతిరిగే షాకిచ్చింది
Representative Image
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Feb 26, 2026 | 9:04 PM

Share

హైదరాబాద్‌లో నమ్మి పని ఇచ్చిన వ్యక్తినే చీట్ చేసింది ఓ కిలేడి. ఆపై పోలీసుల వలలో చిక్కింది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఓ ఇంటి పనిమనిషిని పోలీసులు అరెస్ట్ చేశారు. యజమాని ఇంట్లో బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు ఆరోపణలు రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… బాదంగ్‌పేట్‌కు చెందిన అల్లు తేజస్వి(43) హబ్సిగూడలో నివసించే ఓ డాక్టర్ ఇంట్లో పని చేసేది. గత ఏడాది అక్టోబర్ నుంచి 2026 ఫిబ్రవరి మధ్యకాలంలో ఇంటి అల్మారాల్లో ఉన్న బంగారు నగలను దశలవారీగా అపహరించినట్లు పోలీసులు తెలిపారు.

ఇటీవల ఇంట్లో నగలు కనిపించకపోవడంతో డాక్టర్ అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి అనుమానితురాలైన తేజస్విని అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించగా ఆమె నగలు దొంగిలించినట్లు అంగీకరించింది. ఆమె వద్ద నుంచి రూ.3.88 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంటి పనిమనిషిపై విశ్వాసం ఉంచిన యజమానికి చివరికి షాక్ తగిలినట్టైంది.

Follow Us
ఒక్క వేరియేషన్ రిపీట్ కాకుండా అశ్విన్ ఎన్ని ఓవర్లు వేయగలడో తెలుసా
ఒక్క వేరియేషన్ రిపీట్ కాకుండా అశ్విన్ ఎన్ని ఓవర్లు వేయగలడో తెలుసా
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? అసలు నిజం తెలిస్తే షాక్!
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? అసలు నిజం తెలిస్తే షాక్!
నిజమైన ఆనందం ఎక్కడ ఉంది..? రమణ మహర్షి చెప్పిన అద్భుత సత్యం!
నిజమైన ఆనందం ఎక్కడ ఉంది..? రమణ మహర్షి చెప్పిన అద్భుత సత్యం!
శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినం.. తొలి ఏకాదశి..
శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినం.. తొలి ఏకాదశి..
డీమార్ట్ ఓనర్ ఎంత వరకు చదువుకున్నారో తెలుసా?
డీమార్ట్ ఓనర్ ఎంత వరకు చదువుకున్నారో తెలుసా?
తులసి vs మనీ ప్లాంట్.. మీ తలరాత మారాలంటే ఇంటి గుమ్మం ముందు..
తులసి vs మనీ ప్లాంట్.. మీ తలరాత మారాలంటే ఇంటి గుమ్మం ముందు..
ఒంట్లో వండ‌ర్స్ సృష్టించాలంటే ఈ కాయల వల్లే సాధ్యం..
ఒంట్లో వండ‌ర్స్ సృష్టించాలంటే ఈ కాయల వల్లే సాధ్యం..
పిల్లలు ఫోన్ చూడకుండా అన్నం తినడం లేదా? ఆ అలవాటును మాన్పించాలంటే
పిల్లలు ఫోన్ చూడకుండా అన్నం తినడం లేదా? ఆ అలవాటును మాన్పించాలంటే
జగన్నాథుడు లక్ష్మీదేవికి రసగుల్లా తినిపించే వేడుక.. ఈరోజు యాత్ర..
జగన్నాథుడు లక్ష్మీదేవికి రసగుల్లా తినిపించే వేడుక.. ఈరోజు యాత్ర..
కాక్రోచ్ జనతా పార్టీతో ముగిసిన కేంద్రం చర్చలు..
కాక్రోచ్ జనతా పార్టీతో ముగిసిన కేంద్రం చర్చలు..