AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ జానపద కళకు అరుదైన గౌరవం.. రాష్ట్రపతి చేతుల మీదుగా దుర్శేటి రామయ్యకు పురస్కారం!

దుర్శేటి రామయ్యకు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈ జానపద కడ్డీ తంత్రి కళాకారుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తెలంగాణ జానపద సంగీతానికి, కడ్డీ తంత్రి కళకు ఆయన చేసిన సేవలకు ఈ గుర్తింపు లభించింది. ఇది తెలంగాణ జానపద కళలకు జాతీయ స్థాయిలో గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది.

తెలంగాణ జానపద కళకు అరుదైన గౌరవం.. రాష్ట్రపతి చేతుల మీదుగా దుర్శేటి రామయ్యకు పురస్కారం!
Kaddi Tantri Artist Durshetti Ramayya
Balaraju Goud
|

Updated on: Aug 13, 2026 | 9:36 PM

Share

పెద్దపల్లి: తెలంగాణ జానపద కళకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన జానపద కడ్డీ తంత్రి కళాకారుడు దుర్శేటి రామయ్య కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. జానపద సంగీత విభాగంలో తెలంగాణ నుంచి ఆయనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.

న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రామయ్య అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి సత్కరించారు. తెలంగాణ జానపద సంగీతాన్ని, కడ్డీ తంత్రి కళను రామయ్య ఎన్నో ఏళ్లుగా కాపాడుతూ, భావితరాలకు పరిచయం చేస్తూ వస్తున్నారు.

రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకోవడం గర్రెపల్లి గ్రామానికి ప్రత్యేక గౌరవంగా నిలిచింది. తమ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన రామయ్యను గ్రామస్తులు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జానపద కళలకు మరింత ప్రాచుర్యం తీసుకురావడంలో ఈ పురస్కారం స్ఫూర్తిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

వీడియో ఇక్కడ చూడండి.. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణ జానపద కళకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం..!
తెలంగాణ జానపద కళకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం..!
నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ బిగ్ షాక్..
నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ బిగ్ షాక్..
నుదుటిపై ముద్దుపెట్టి తిరిగి వెళ్లిన మృత్యువు..2సెకన్ల తేడాతో
నుదుటిపై ముద్దుపెట్టి తిరిగి వెళ్లిన మృత్యువు..2సెకన్ల తేడాతో
సామాన్యుడి ఫేవరెట్‌ కార్‌‌.. నానో మళ్లీ రాబోతోందా?
సామాన్యుడి ఫేవరెట్‌ కార్‌‌.. నానో మళ్లీ రాబోతోందా?
బ్రేక్‌ఫాస్ట్‌కి టైమ్‌ లేదా?.. 5 నిమిషాల్లో ఎగ్ భుర్జీ శాండ్‌విచ్
బ్రేక్‌ఫాస్ట్‌కి టైమ్‌ లేదా?.. 5 నిమిషాల్లో ఎగ్ భుర్జీ శాండ్‌విచ్
క్యాబ్ బుకింగ్‌లో కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై ఆ ఫీచర్‌ తొలగింపు!
క్యాబ్ బుకింగ్‌లో కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై ఆ ఫీచర్‌ తొలగింపు!
ఎంత కడిగినా నూనెసీసా జిడ్డు పోవడం లేదా?.. ఈ హ్యాక్‌ ట్రై చేయండి!
ఎంత కడిగినా నూనెసీసా జిడ్డు పోవడం లేదా?.. ఈ హ్యాక్‌ ట్రై చేయండి!
భారత్‌లోకి విన్‌ఫాస్ట్ రసద్ మ్యాక్సీ ఈవీ.. డిజైన్ అదుర్స్
భారత్‌లోకి విన్‌ఫాస్ట్ రసద్ మ్యాక్సీ ఈవీ.. డిజైన్ అదుర్స్
క్రిస్పీగా.. టేస్టీగా.. హెల్తీగా!.. కూరగాయలతో చిప్స్‌ ఇలా చేయండి
క్రిస్పీగా.. టేస్టీగా.. హెల్తీగా!.. కూరగాయలతో చిప్స్‌ ఇలా చేయండి
బ్లాక్ కాఫీ తాగి వర్కౌట్ చేస్తున్నారా?.. ఈ తప్పు మాత్రం చేయొద్దు!
బ్లాక్ కాఫీ తాగి వర్కౌట్ చేస్తున్నారా?.. ఈ తప్పు మాత్రం చేయొద్దు!