నదీ జలాలపై మళ్లీ రాజకీయం..! మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. ఆగస్టు 18న ఏం జరగబోతోంది?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య గోదావరి జలాల వివాదం మరోసారి వేడెక్కింది. ఆగస్టు 18న జరగనున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) సమావేశం చుట్టూ రెండు రాష్ట్రాల్లో రాజకీయ హీట్ పెరిగింది. తెలంగాణలోని ఏడు సాగునీటి ప్రాజెక్టులపై పునస్సమీక్ష, కాళేశ్వరం నీటి సామర్థ్యం, సమ్మక్కసాగర్ అనుమతులు, తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వంటి అంశాలపై ఏపీ లేవనెత్తిన డిమాండ్లు చర్చకు రానున్నాయి.

బిగ్ వీక్ ఫర్ టూ స్టేట్స్. ఆంధ్రా, తెలంగాణల మధ్య వాటర్ వార్స్ వేడెక్కి రాబోయే వారం రోజులూ నషాళానికంటే సీజన్ ఇది. ఎందుకంటే, KRMB, GRMB.. క్రిష్ణా, గోదావరి నదీజలాల మేనేజ్మెంట్ బోర్డులు రెండూ కీలకంగా సమావేశమయ్యే థిక్కెస్ట్ సీజన్ ఇది. 13న కెఆర్‌ఎంబీ, 18న జీఆర్‌ఎంబీ.. సమావేశాలకు డేట్లు ఫిక్స్. ఎజెండాలూ ఫిక్స్. డ్యామ్‌లలో నీటిమట్టాలు, ప్రాజెక్టుల పనితీరు, నీళ్ల విడుదల, పెండింగ్ ప్రాజెక్టులు, వాటికివ్వాల్సిన పర్మిషన్లు.. ఇవీ రెగ్యులర్ మీటింగ్స్‌లో ఉండే ఎజెండాలు. ఈసారి మాత్రం డిబేటబుల్ పాయింట్లు మారిపోవడంతో ఇంతకుమించి వాడీవేడీగా ఉండబోతోంది చర్చ. రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే మంటను రాజేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్యే కాదు, ఒక రాష్ట్రంలో ఆ మూడు పార్టీల మధ్య విచిత్రమైన కొట్లాట మొదలైంది. గురువారం జరగాల్సిన KRMB మీటింగైతే ఆఖరినిమిషంలో వాయిదా పడింది. జీఆర్‌ఎంబీ మీటింగు మీదే రెండు రాష్ట్రాల్లో ఎగతెగని సస్పెన్స్. ఈనెల 18న ఏం జరగబోతోంది..? గోదావరి జలాలపై రెండు రూలింగ్ పార్టీల్లో ఎవరు తగ్గుతారు.. ఎవరు నెగ్గుతారు? నదీ జలాలపై తెలంగాణలో సెంటిమంట.. GRMB మీటింగ్ చుట్టూ జగడం.. వెళితే తప్పేంటని వీళ్లు… వెళ్లడమే తప్పని వాళ్లు! మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. పాత ప్రాజెక్టులపై కొత్తగా చర్చ.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ? ఆగస్టు 18న ఏం జరగబోతోంది? 2026.. డిఫికల్ట్ వాటర్ ఇయర్.. నీళ్ల పరంగా దేశం మొత్తానికీ అత్యంత క్లిష్టమైన సంవత్సరం. సూపర్...
