చీరకట్టులో  చూడచక్కని ముద్దుగుమ్మ.. బాంధవి శ్రీధర్

23 September  2026

Rajeev 

Pic credit - Instagram

తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు బాంధవి శ్రీధర్. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. బాలనటిగా పలు చిత్రాల్లో కనిపించింది.

ఆ తర్వాత మోడలింగ్ వైపు కూడా అడుగులు వేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే 2022లో విడుదలైన ‘మసూద’ సినిమాతో బాంధవికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది.

ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా బాంధవి శ్రీధర్ మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ఎరుపు రంగు చీరలో సంప్రదాయ లుక్‌లో కనిపించిన ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ట్రెడిషనల్ లుక్‌లో బాంధవి అందంగా కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు

బాంధవి శ్రీధర్ బాలనటిగా ‘మొగుడు’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘రామయ్య వస్తావయ్య’ వంటి సినిమాల్లో కనిపించింది.

తర్వాత హీరోయిన్‌గా ఎదగాలని ప్రయత్నిస్తున్న సమయంలో ‘మసూద’ ఆమె కెరీర్‌కు కీలకంగా మారింది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె నటనకు మంచి స్పందన లభించింది.

బాంధవి శ్రీధర్‌కు ‘సైరాభాను’ హీరోయిన్‌గా మంచి అవకాశం అందుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో తన గ్లామరస్, ట్రెడిషనల్ ఫొటోషూట్లతోనూ ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది.