సినిమా సక్సెస్‌కు భారీ బడ్జెట్, స్టార్ హీరోల కలయిక గ్యారెంటీ కాదని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. కంటెంట్ బలంగా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్, ప్రియదర్శన్ కాంబినేషన్లో వచ్చిన హైవాన్ చిత్రం. రూ.130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 8 రోజుల్లో కేవలం రూ.66 వేలు మాత్రమే వసూలు చేసి బాలీవుడ్‌ను ఆశ్చర్యపరిచింది.