ది రాజా సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో దర్శకుడు మారుతి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం అప్పట్లో వైరల్ అయింది. అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న సంగీత దర్శకుడు తమన్ వెనక నుంచి నవ్వుకున్నారట. తాజాగా ఓ ఇంటరాక్షన్ లో ఈ విషయం గుర్తు చేసుకుంటూ, మారుతిని ఓదార్చమని సుమ మైక్ ఇచ్చినా తనకు నవ్వొచ్చిందే తప్ప ఏడుపు రాలేదని తమన్ సరదాగా చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.