ఉత్తరప్రదేశ్‌లోని బల్ రాంపూర్‌లో డీజే శబ్దాల వల్ల ఒక రెండవ తరగతి బాలిక క్లాస్‌రూమ్‌లో ప్రాణాలు కోల్పోయింది. 120-150 డెసిబుల్స్ వద్ద ఉన్న డీజే సౌండ్ గుండె, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, పిల్లలలో కార్డియాక్ అరెస్ట్‌కు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్కూళ్లు, ఆసుపత్రుల వద్ద సైలెన్స్ జోన్ల నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.