ఒకే ఒక్క సినిమాతో క్రేజ్... కట్ చేస్తే వరుస ఫ్లాపులు
23 September 2026
Rajeev
Pic credit - Instagram
తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు హెబ్బా పటేల్. ‘కుమారి 21F’ సినిమాతో ఒక్కసారిగా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు తన లేటెస్ట్ ఫొటోషూట్స్‌తోనూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
తాజాగా హెబ్బా పటేల్ షేర్ చేసిన స్టైలిష్ లుక్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో కనిపించిన ఆమె గ్లామరస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గ్లామర్‌తో పాటు ఎలిగెంట్ లుక్‌లోనూ మెప్పించగలనని మరోసారి నిరూపించింది ఈ బ్యూటీ. హెబ్బా పటేల్ 2014లో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది.
2015లో వచ్చిన ‘కుమారి 21F’ ఆమె కెరీర్‌లో కీలకమైన సినిమాగా నిలిచింది. ఈ చిత్రంతో హెబ్బాకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
కెరీర్ ప్రారంభంలో గ్లామరస్ హీరోయిన్‌గా ఎక్కువగా కనిపించిన హెబ్బా.. క్రమంగా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటనలోనూ వైవిధ్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తోంది.
సినిమాల ఎంపికలో మార్పు తీసుకురావడంతో పాటు తన సోషల్ మీడియా పోస్టులతోనూ అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటోంది.