AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara Holidays: అబ్బబ్బ.. ఎన్ని రోజులో.. దసరా సెలవులు వచ్చేస్తున్నావ్.. విద్యార్థులకు పండగో పండగ..

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబర్ 10 నుంచి 22 వరకు కొనసాగనున్నాయి. అక్టోబర్ 1 నుంచి 9 వరకు SA-1 పరీక్షలు నిర్వహించి, అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 13 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు లభించనున్నాయి.

Dasara Holidays: అబ్బబ్బ.. ఎన్ని రోజులో.. దసరా సెలవులు వచ్చేస్తున్నావ్.. విద్యార్థులకు పండగో పండగ..
Telangana Dussehra Holidays
Shaik Madar Saheb
|

Updated on: Sep 24, 2026 | 8:16 AM

Share

విద్యార్థులకు మరో గుడ్ న్యూస్.. తాజాగా.. వినాయక చవితి నేపథ్యంలో వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి.. శుక్రవారం నిమిజ్జనం, రెండో శనివారం, ఆదివారం మూడు రోజులు సెలవులు లభించనున్నాయి.. ఈ తరుణంలో విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. దసరా సెలవులపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబరు 10 నుండి 22వ తేదీ వరకు మొత్తంగా 13 రోజుల పాటు దసరా సెలవులు లభించనున్నాయి. అకడమిక్ విద్యా క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులను ఖరారు చేసినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

అయితే, ఈ 13 రోజుల్లో అక్టోబరు 10న రెండో శనివారం, అలాగే 11, 18 తేదీలు ఆదివారాలు కావడంతో నికరంగా పది రోజులే పనిదినాల సెలవులుగా ఉండనున్నాయని అధికారులు తెలిపారు.

అక్టోబరు 1 నుంచి ఎస్ఏ-1 పరీక్షలు:

దసరా సెలవులను దృష్టిలో ఉంచుకుని, సమ్మేటివ్ అసెస్మెంట్ (SA-1) పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్య పరిశోధన, శిక్షణ మండలి (SCERT) తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం అక్టోబరు 1వ తేదీన ఎస్ఏ-1 పరీక్షలు ప్రారంభమై, అక్టోబరు 9 నాటికి పూర్తవుతాయి. పరీక్షలు ముగిసిన మరుసటి రోజు (అక్టోబరు 10) నుంచే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి.

ఏపీలో ఎన్ని రోజులంటే..

ఇక ఏపీ విషయానికొస్తే.. 10 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ఉండనున్నట్లు సమాచారం.. 2026-27 విద్యా క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12 నుంచి దసరా పండుగ సెలవులు మొదలు కానున్నాయి.. అక్టోబర్ 21 వరకు మొత్తం 10 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి.. ఏపీ, తెలంగాణలో సెలవులు భిన్నంగా ఉంటాయి..

అయితే.. ఈ ఏడాది ఏకంగా 13 రోజులు సెలవులు వస్తుండటంతో మంచిగా టూర్‌లకు ప్లాన్ చేసుకోవచ్చు.. అలాగే, సెలవుల్లో ఊర్లకు వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకోవచ్చు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us