AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Pragathi: ఆ హీరో అంటే ఇష్టం.. అలాంటి నటుడిని ఇప్పటివరకు చూడలేదు.. నటి ప్రగతి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రగతి. దశాబ్దాలుగా సినీ ప్రయాణంలో ఎక్కువగా తల్లి పాత్రలతో ఫేమస్ అయ్యింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రగతి మాట్లాడుతూ.. తన ఆల్ టైమ్ ఫేవరేట్ హీరో, హీరోయిన్ల గురించి చెప్పుకొచ్చింది. అలాగే మహిళా సాధికారత గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

Actress Pragathi: ఆ హీరో అంటే ఇష్టం.. అలాంటి నటుడిని ఇప్పటివరకు చూడలేదు.. నటి ప్రగతి..
Pragathi
Rajitha Chanti
|

Updated on: Sep 24, 2026 | 9:18 AM

Share

టాలీవుడ్ విలక్షణ నటి ప్రగతి సినీ పరిశ్రమలోని తన అభిమాన నటీనటులు, అలాగే మహిళా సాధికారత వంటి సామాజిక అంశాలపై తన లోతైన అభిప్రాయాలను పంచుకున్నారు. హీరోలలో తన ఆల్ టైమ్ ఫేవరెట్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు, ప్రగతి ఎటువంటి సంకోచం లేకుండా వెంకటేష్ పేరును ప్రస్తావించారు. “ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆయనని అలా చూస్తూ కూర్చుంటాను. ఆయన చాలా సౌమ్యుడు, అంత గ్రౌండెడ్ గా నేను ఎప్పుడూ ఎవ్వరినీ చూడలేదు. ఆయనలో ఎంతో టాలెంట్ ఉంది, ఆయన ఉంటేనే సెట్‌కి ఒక ఎనర్జీ వచ్చేస్తుంది,” అని వెంకటేష్‌ను ప్రగతి అన్నారు. ఆయనలోని నిరాడంబరత, ప్రతిభ, వృత్తి పట్ల అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆమె తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

హీరోయిన్ల విషయానికి వస్తే, అనుష్క శెట్టి అంటే తనకు ప్రత్యేక అభిమానం అని ప్రగతి స్పష్టం చేశారు. “అంత మంచి అమ్మాయిని నేను ఇప్పటిదాకా నా జీవితంలో చూడలేదు. కేవలం సినిమాలలోనే కాదు, బయట కూడా ఆమె నిరాడంబరంగా ఉంటారు. షి ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హంబుల్, మోస్ట్ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఐ హావ్ సీన్. ఒక అమ్మాయి ఇలా ఉంటే దేవతలే ఉంటారు కైండ్ ఆఫ్ పర్సన్,” అని అనుష్కను ప్రగతి ప్రశంసించారు. అనుష్క గురించి తాను చాలా మంది దగ్గర విన్నానని, ఒక్క నెగటివ్ పాయింట్ కూడా ఎవరూ చెప్పలేదని, స్వీటీ అనే పేరును ఆమె సార్ధకం చేసుకున్నారని ప్రగతి పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

అనంతరం, విజయవంతమైన మహిళగా, మహిళా సాధికారత గురించి తన అభిప్రాయాలను తెలియజేయమని అడగగా, ప్రగతి ఈ అంశంపై ఒక స్పష్టమైన దృక్పథాన్ని అందించారు. మహిళా సాధికారత అంటే ముందుగా దానిపై సరైన అవగాహన రావాలని ఆమె అన్నారు. “ఇది పురుషులతో పోటీ పడటం కాదు. ఫెమినిజం అని అంటే మగవాళ్ళని తొక్కేస్తే మనం ఫెమినిజం అనుకుంటారు, అది కాదు పాయింట్,” అని ఆమె వివరించారు. సమాజంలో పురుషులు, మహిళలు సమానంగా ఎదగడానికి అవకాశం ఉందని, ముఖ్యంగా విద్య విషయంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు సమాన పెట్టుబడిని అందిస్తున్నారని ఆమె అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

వెంకటేశ్..

Venkatesh Movies

Venkatesh Movies

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

Follow Us