AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Paradise Movie Review: ది పారడైజ్ మూవీ రివ్యూ.. నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి హిట్టు కొట్టారా..?

దసరా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాని, శ్రీకాంత్ కాంబినేషన్లో వచ్చిన పారడైజ్ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఓవైపు యూట్యూబ్, సోషల్ మీడియాలో ది ప్యారడైజ్ మూవీ సాంగ్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటన్నింటినీ నిలబెడుతూ పారడైజ్ అంచనాలు అందుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

The Paradise Movie Review: ది పారడైజ్ మూవీ రివ్యూ.. నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి హిట్టు కొట్టారా..?
The Paradise Movie Review
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 24, 2026 | 6:21 AM

Share

మూవీ రివ్యూ: ది ప్యారడైజ్

నటీనటులు: నాని, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, కయాదు లోహర్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరి రావు తదితరులు

ఎడిటర్: నవీన్ నూలీ

సినిమాటోగ్రాఫర్: సాయి

సంగీతం: అనిరుధ్ రవిచందర్

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల

దసరా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాని, శ్రీకాంత్ కాంబినేషన్లో వచ్చిన పారడైజ్ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. మరి వాటన్నింటినీ నిలబెడుతూ పారడైజ్ అంచనాలు అందుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సవారి జాతికి మాత్రం స్వాతంత్రం రాదు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో షికింజా మాలిక్ (మోహన్ బాబు) కనుసనల్లో సవారి జాతి బతుకుతుంది. వాళ్లకు గుర్తింపు లేకుండా చేస్తాడు మాలిక్. కానీ తమ జాతికి గుర్తింపు కావాలి అని సమ్మక్క (సోనాలి కులకర్ణి) పోరాడుతూ ఉంటుంది. ఆమె కొడుకు జడల్ (నాని) ఒక మర్డర్ కేసులో 14 సంవత్సరాలు జైల్లో ఉండి వస్తాడు. కాకపోతే తల్లి తప్పు చేసింది అని నమ్మి ఆమెకు దూరంగా ఉంటాడు. ఆ తర్వాత తన జాతి కోసం తల్లి చేసిన త్యాగం అర్థం చేసుకుంటాడు. అదే సమయంలో తిరిగి వచ్చిన తర్వాత షికింజా మాలిక్ కొడుకు విక్రమ్ మాలిక్ (రాఘవ్ జుయల్) తో జడలు కు గొడవ స్టార్ట్ అవుతుంది. అది పెరిగి పెద్దదై పెద్ద మాలిక్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. సవారీల పోరాటం ఎంతవరకు వచ్చింది.. వాళ్లకు చివరికి గుర్తింపు వచ్చిందా లేదా అనేది కథ..

కథనం:

దర్శకుడు శ్రీకాంత్ ఓడలను వాళ్ళ టీం ముద్దుగా మెంటలోడు అని పిలుస్తారు.. ఆ మేకింగ్ ఏంటి.. ఆ టేకింగ్ ఏంటి.. శ్రీకాంత్ ఓదెల నిజంగానే మెంటలోడు అనుకుంటారు.. ఇది పాజిటివ్ యాంగిల్ లో..! ది పారడైజ్ ఫస్ట్ అఫ్ చూసిన తర్వాత నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు అనిపించింది.. కానీ సెకండ్ హాఫ్ దారి తప్పాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. అంత పెద్ద ఇంటర్వెల్ సీక్వెన్స్ తర్వాత సెకండ్ హాఫ్ సరిగా డీల్ చేయలేకపోయాడు. ముఖ్యంగా ఫస్ట్ 15 నిమిషాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ తర్వాత నాని ఇంట్రడక్షన్.. ప్రీ ఇంటర్వెల్ సీన్స్ మంచి హై ఇస్తాయి. కయాదు లోహర్ సీన్స్ గురించి నో డిస్కషన్.. హీరోయిన్ ట్రాక్ మీద కాస్త ఆలోచించి ఉండాల్సిందే. అలాంటి సన్నివేశాలు కచ్చితంగా ఇబ్బందికరంగానే ఉంటాయి. సెకండాఫ్ లో మోహన్ బాబు వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి. కానీ కీలకమైన సన్నివేశాల విషయానికి వచ్చేసరికి పట్టు తప్పినట్టు అనిపించింది. ఫస్టాఫ్ లో వర్కవుట్ అయిన ఎమోషన్ సెకండ్ హాఫ్ లో కుదరలేదు. దానితోడు అనవసరపు రాజకీయాలు సినిమాలో ఇరికించినట్టు అనిపించింది.. క్లైమాక్స్ కూడా పూర్తిగా రాజకీయం చేయడం అసంపూర్తిగా అనిపించింది. గుర్తింపు కోసం చేసే పోరాటానికి సంబంధించిన ఎమోషన్ మిస్ అవుతుంది.. కేవలం స్క్రీన్ మీద వయోలెన్స్ మాత్రమే కనిపిస్తుంది. చాలావరకు సన్నివేశాలు మాస్ ఆడియన్స్ ను మెప్పించేలా ఉన్నాయి. కాకపోతే వాటిని మరింత కన్విన్సింగ్ గా చెప్పి ఉంటే చాలా బాగుండేది.

నటీనటులు:

నాని తన వరకు అద్భుతంగా నటించాడు.. తన దర్శకుడు ఏం చెప్తే అది చేశాడు. మోహన్ బాబు ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్.. కానీ ఆయనను కూడా ఇంకాస్త వాడుకొని ఉంటే బాగుండేది అనిపించింది. రాఘవ్ జుయల్ ఉన్నంతసేపు బాగున్నాడు. మరొక కీలక పాత్రలో సోనాలి కులకర్ణి బాగా నటించింది.. సంపూర్ణేష్ బాబు ఓకే. కయాదు లోహర్ ఉన్నంతవరకు పర్లేదు. మిగిలిన వాళ్ళు అన్నీ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు మెయిన్ హీరో అనిరుద్.. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా కోసం ప్రాణం పెట్టాడు. చాలా చోట్ల అనిరుద్ సంగీతం సినిమాను కాపాడింది. నవీన్ నూలి సెకండ్ హాఫ్ మీద ఫోకస్ చేసి ఉండాల్సిందే. సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీకాంత్ ఓదెల తనకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ఇంకాస్త బాగా యూస్ చేసుకొని ఉండాల్సింది. సెకండ్ హాఫ్ మీద ఫోకస్ చేసి ఉంటే ప్యారడైజ్ చాలా మంచి మాస్ సినిమా అయి ఉండేది. ఇప్పటికీ అదిరిపోయే ఫస్ట్ ఆఫ్ ఈ సినిమాను మాస్ లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.

పంచ్ లైన్:

ఓవరాల్ గా ది ప్యారడైజ్.. గుర్తింపు కోసం పోరాటం..!

Follow Us