గ్యాస్‌ సిలిండర్‌ కావాలంటే ముందు ఈ పని చేయండి.. లేకుంటే నో బుకింగ్‌

August 13, 2026

Subhash

గ్యాస్ సిలిండర్ వినియోగించే వారికి ముఖ్యమైన సమాచారం. LPG కనెక్షన్‌కు సంబంధించిన e-KYC ప్రక్రియను పూర్తి చేయాలని చమురు సంస్థలు సూచిస్తున్నాయి. 

e-KYC

గడువులోగా e-KYC పూర్తి చేయకపోతే గ్యాస్ సబ్సిడీ, సిలిండర్ బుకింగ్ వంటి సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందని వినియోగదారులను హెచ్చరిస్తున్నారు.

e-KYC

ప్రస్తుతం వినియోగదారులు ఆధార్‌తో గ్యాస్ కనెక్షన్‌ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఫేస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ లేదా ఐరిస్ స్కాన్ వంటి విధానాలను ఉపయోగించుకోవచ్చు.

ఆధార్‌తో

స్మార్ట్‌ఫోన్ వినియోగంపై అవగాహన లేని వారు తమకు సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి e-KYC పూర్తి చేసుకోవచ్చు. 

e-KYC ఎక్కడ చేసుకోవాలి?

ఇందుకోసం ఆధార్ కార్డు, గ్యాస్ పాస్‌బుక్ వెంట తీసుకెళ్లాలి. ఏజెన్సీ వద్ద e-KYC ప్రక్రియను ఉచితంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది.

ఆధార్ కార్డు

గ్యాస్ డెలివరీ సిబ్బంది వద్ద అందుబాటులో ఉన్న e-KYC పరికరాల ద్వారా కూడా ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం ఉందని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.

గ్యాస్ డెలివరీ 

ఆన్‌లైన్‌లో e-KYC పూర్తి చేయాలనుకునే వారు తమ గ్యాస్ కంపెనీ అధికారిక మొబైల్ యాప్‌ను ఉపయోగించాలి.

ఇంటి నుంచే e-KYC

HP Gas, Indane లేదా Bharat Gas అధికారిక యాప్‌ను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి.యాప్‌లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి.

అధికారిక యాప్‌

తర్వాత My Profile విభాగంలోకి వెళ్లాలి. అక్కడ సూచించిన నిబంధనలు, షరతులను అంగీకరించిన తర్వాత OTP లేదా Face Scan ద్వారా గుర్తింపును ధ్రువీకరించాలి.

నిబంధనలు